the-rajasab (image :x)
ఎంటర్‌టైన్మెంట్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్.. ప్రభాస్ ఎం ఉన్నాడు మామా..

The RajaSaab: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త. మారుతి తెరకెక్కిస్తున్న ప్రభాస్ తాజా చిత్రం’ది రాజా సాబ్’లో ప్రభాస్ తో షూటింగ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ, ప్రభాస్‌తో తన ప్రయాణాన్ని “విజయవంతమైనది”గా అభివర్ణించారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు ఒక అరుదైన, భావోద్వేగ ఘట్టాన్ని గుర్తు చేసింది. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం, అంటే నవంబర్ 11, 2002న ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి తన తొలి అడుగు వేశారు. సరిగ్గా అదే రోజున (నవంబర్ 11, 2025) ‘ది రాజా సాబ్’ చిత్రానికి ప్రభాస్ తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేయడం యాదృచ్ఛికంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మారుతి పంచుకున్న సందేశం రెబెల్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Read also-Anu Emmanuel: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో దుర్గ క్యారెక్టర్ నా కోసమే పుట్టింది.. అను ఇమ్మాన్యుయేల్

మారుతి తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు: “23 ఏళ్ల క్రితం ఆయన సినిమాలోకి తన తొలి అడుగు వేశారు. ఈరోజు అదే రోజున ఆయన #TheRajaSaab ప్రయాణాన్ని ముగించారు. ఆయన విజయవంతమైన ప్రయాణంలో భాగం కావడం నాకు దైవ అదృష్టం. ‘ది రాజా సాబ్’ పూర్తిగా భిన్నమైన శక్తిని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. మీ ప్రేమ, ఆత్రుత మాకు తెలుసు. అత్యుత్తమమైన దాన్ని మాత్రమే అందిస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. మన రెబెల్ గాడ్ భక్తులకు ముందు ముందు మరిన్ని వేడుకల రోజులు ఉన్నాయి.” ఈ ప్రకటనతో పాటు ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో ఉన్న ఒక ఆకర్షణీయమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

హారర్-కామెడీ డ్రామాగా..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ‘ది రాజా సాబ్’ ఒక హారర్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఒక పాడైపోయిన భవనం రహస్యాల చుట్టూ తిరుగుతుంది. దెయ్యాలు, భయానక జీవులు ఉన్న ఈ భవనంలో నిక్షిప్తమైన నిధిని పొందడానికి ప్రయత్నించే సరదా వ్యక్తి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యమైన, భయానకమైన పాత్రలో కనిపిస్తారు. వీరితో పాటు రిద్ధి కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే హస్యం, మ్యాజికల్ అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

Read also-Nagarjuna: వారికి కూడా ఆ సత్తా లేదంటున్న కింగ్ నాగార్జున.. ఎందుకంటే?

ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావడంతో, చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అంచనాలను అందుకుంటూ ‘ది రాజా సాబ్’ వచ్చే ఏడాది జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ తన అద్భుతమైన కెరీర్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ తీస్తున్న ‘కల్కి 2898 AD పార్ట్ 2’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ ప్రభాస్ స్టార్‌డమ్‌ను మరింత పెంచుతాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

BIBINagar Lake: ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారిన ఓ చెరువు.. ఎక్కడో తెలుసా..!

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 2029 నాటికి ప్రతీ ఒక్కరికి సొంతిల్లు!

Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..

MLC Kavitha: జగదీష్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్​: రూ.900 కోట్ల భూ వ్యవహారంపై కలెక్టర్ ఫోకస్..!