Jubilee-Hills-Exit-Polls
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్‌ విజేత ఎవరు?.. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే

Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజేత ఎవరు?, ఏ పార్టీ జెండా ఎగరబోతోంది?,.. పోలింగ్ పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజానీకంలో నెలకొన్న ఉత్కంఠ ఇదీ!. ఓటరన్న ఇచ్చిన అసలు ఫలితం శుక్రవారం తేలనున్నప్పటికీ, ఉత్కంఠను పెంచుతూ ఎగ్జిట్ పోల్స్ (Jubilee Hills Exit Polls) వెలువడ్డాయి.

జూబ్లీహిల్స్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 48 శాతం ఓట్లు వస్తాయని ‘స్మార్ట్ పోల్’ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు 42 శాతం, బీజేపీ అభ్యర్థికి కేవలం 8 శాతం, ఇతరులకు 2.1 శాతం ఓట్లు పడతాయని లెక్కగట్టింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.

చాణక్య స్ట్రాటజీస్ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. హస్తం పార్టీకి 46 శాతం, బీఆర్ఎస్‌కు 43 శాతం, బీజేపీకి 6 శాతం, ఇతరులకు 5 శాతం చొప్పున ఓట్లు పడతాయని అంచనా వేసింది.

హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార పార్టీ గెలుపు ఖాయమని లెక్కగట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 48.31 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 43.18 శాతం ఓట్లు, బీజేపీకి 5.84 శాతం ఓట్లు, ఇతరులకు 2.67 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

రేస్ అనే ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశం ఉందని ప్రకటించింది. కాంగ్రెస్‌కు 46 శాతం, బీఆర్ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2-5 శాతం మధ్య ఓట్లు వస్తాయని లెక్కగట్టింది.

Just In

01

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు

Santana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదలైంది..

Balaram Naik: ప్రమాద రహిత సింగరేణి ధ్యేయంగా పనిచేయాలి : సీఎండీ ఎన్.బలరామ్

Anu Emmanuel: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో దుర్గ క్యారెక్టర్ నా కోసమే పుట్టింది.. అను ఇమ్మాన్యుయేల్

Kunamneni Sambasiva Rao: పేద ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు