Neutral Voters: తటస్థ ఓట్లర్లపైనే పార్టీలన్నీ దృష్టిసారించాయి. గెలువాలంటే వీరే కీలకం. అందుకే వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉండటంతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్ లిస్టుతో ప్రతి ఇంటికి తిరిగారు. కలిసి ఓటువేయాలని అభ్యర్ధించారు. ఎన్నికల ప్రచారం ఆదివారమే ముగిసినప్పటికీ పోటీచేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి అవకాశం ఇవ్వడంతో సోమవారం డివిజన్లలోని స్లమ్ ఏరియాలో ఎక్కువగా తిరిగారు. ఆ ప్రజలకు గెలిస్తే చేయబోయే హామీలను ఇచ్చినట్లు సమాచారం.
షేక్ పేట డివిజన్లే ప్రధానం
జూబ్లీహిల్స్ లో పార్టీల కేడర్ కంటే తటస్థ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. కాలనీలు, బస్తీలు, మురికివాడలే అధికంగా ఉన్నాయి. ఇక్కడి ఓటర్లకు పార్టీలతో సంబంధం ఉండదు. సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపేవారికే ప్రయార్టీ ఇస్తారు. 6 డివిజన్లలో ఎక్కువగా ఓటర్లు ఉన్నది మాత్రం రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్ పేట డివిజన్లలే ప్రధానంగా అభ్యర్ధి విజయాన్ని నిర్ణయించనున్నాయి. రహమత్ నగర్ లో దాదాపు 70వేల ఓట్లు ఉన్నట్లు అంచనా. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ నెలకొనగా బీఆర్ఎస్కు ప్రజలు బాసటగా నిలిచారు. ఎర్రగడ్డ డివిజన్ లోనూ ఓటర్లు గెలుపోటముల్లో కీలక భూమిక పోషించనున్నట్లు సమాచారం. ఈ డివిజన్ లో 80వేలకు పైగా ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఏ పార్టీ అభ్యర్థి గెలువాలన్న ఈ మూడు డివిజన్ల నుంచి ప్రజలు ఎవరికి మొగ్గుచూపితే అటు విజయం దక్కే అవకాశం ఉంది. అంతేగాకుండా మైనార్టీ ఓట్లు సైతం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు
గత అసెంబ్లీ ఎన్నికల్లో షేక్ పేటలో బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బోరబండలో మాత్రం లోక్ సభ ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని జీహెచ్ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మొగ్గుచూపారు. రహమత్ నగర్ డివిజన్ లో లేబర్ ఎక్కువ. ఈ డివిజన్ కూడా బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు పడ్డాయి. యూసుఫ్ గూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోటాపోటీగా పడ్డాయి. దీంతో ఈసారి కాలనీలు, బస్తీలపై ఫోకస్ పెట్టి ఇరుపార్టీల నేతలు ప్రచారం చేశారు. పార్టీ తరుపున పార్టీ కార్యకర్తలు కాలనీలు, బస్తీల్లోని ఇంటింటికి తిరిగి ఓటర్ల లిస్టుతో తిరిగి ఓటర్లను ఆరా తీశారు. ఎక్కువగా ఓటర్లు ఉన్న కుటుంబాల వివరాలను సేకరించడంతో ఏ పార్టీకి మొగ్గుచూపుతున్నారని ఆరా తీశారు. ఓటర్ల జాబితాలో ఉన్నవారి వివరాలను తెలుసుకొని మంగళవార పోల్ మేనేజ్ మెంట్ చేసినట్లు సమాచారం. ఎక్కువగా తటస్త ఓటర్లు ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఇది గెలిస్తే పార్టీకి భవిష్యత్తు
మంగళవారం పోలింగ్ నేపథ్యంలో అన్నిపార్టీల అధిష్టానాలు పోలింగ్ ఏజెంట్లకు సోమవారం దిశానిర్దేశం చేశాయి. పోలింగ్ బూత్ లవారీగా ఓటర్ల వివరాలను వివరించి, లేనివారెవరూ అని నోటిఫై సైతం చేసినట్లు సమాచారం. ఇక వేళ ఎవరైనా వారి పేరుతో వస్తే అడ్డుకోవాలని సూచించారు. ప్రతి ఓటు కీలకమని, ఇది గెలిస్తే పార్టీకి భవిష్యత్ ఉంటుందని, మీ శ్రమకు తగిన ప్రతిఫలం సైతం ఇస్తామని, పార్టీలో గుర్తింపు ఇస్తామని సూచించినట్లు సమాచారం. పోలింగ్ మొదలు ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఎవరికి భయపడొద్దని, ఎజెంట్ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. అదే విధంగా ఎవరైనా ఓటర్ రాకపోతే సమాచారం సైతం ఇచ్చి ఓటువేసేలా చర్యలు తీసుకోవాలని ఏజెంట్లకు ఆదేశాలిచ్చారు.
నేతల నుంచి ఫీడ్ బ్యాక్..
ఇప్పటివరకు చేసిన ప్రచార సరళి, అధికార, ప్రతిపక్షాలపై చేసిన అస్త్రాలు ఏమేరకు వర్కవుట్ అవుతాయి.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనే వివరాలను వార్ రూం నుంచి ఆరా తీశారు. ప్రచారం నిర్వహించిన నేతల నుంచి సైతం ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఏ డివిజన్ లో, ఏ బస్తీలో వీక్ గా ఉంటే అక్కడ దృష్టిసారించి అక్కడి నేతలనే అలర్టు చేసినట్లు సమాచారం. ప్రధానపార్టీలు ప్రతిఓటర్ ను పోలింగ్ బూత్ లకు తీసుకొచ్చేందుకు పార్టీ కేడర్ ను సూచనలు చేశారు.
ప్రలోభాలకు తెర!
అన్నిపార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కీలకంగా తీసుకొని ప్రచారం నిర్వహించాయి. అదులో భాగంగానే పోలింగ్ కు ముందు రోజూ అన్నిపార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశాయనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదుతో పాటు చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు సైతం పంపిణీచేశారని సోషల్ మీడియాలో సైతం విస్తృత ప్రచారం జరుగుతుంది. 150కోట్లకు పైగా పంపకాలు జరిగాయనే ప్రచారం ఊపందుకుంది. ప్రతి ఓటర్ ను పార్టీల నేతలు కలిసి తాయిలాలు ఇచ్చినట్లు సమాచారం.
Also Read: Abhinay Kinger death: ప్రముఖ తమిళ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూత.. చివరి క్షణాల్లో సాయం కోసం..
