44 IAS transfer t.government
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:భారీగా ఐఎఎస్ ల బదిలీ

  • రాష్ట్రవ్యాప్తంగా 44 మంది ఐఏఎస్ లు బదిలీ
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
  • గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఆమ్రపాలి
  • ట్రాన్స్ కో సీఎండీగా రొనాల్డ్ రాస్..
  • ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్..
  • దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్య ఆర్..
  • కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ
  • జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ గా ఏవీ రంగనాథ్..
  • హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్..
  • యానిమల్ హజ్బెండ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి గోష్
  • లేబర్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇన్సూరెన్స్ సెక్రటరీగా సంజయ్ కుమార్
  • టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీగా వాణి ప్రసాద్
  • కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ
  • టూరిజం ఎండీ గా ప్రకాష్ రెడ్డి

Telangana sarkar transfer the 44 IAS officials for welfare schemes:


తెలంగాణలోని భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ బదిలీలు జరగడంతో పాలనపరంగా ప్రక్షాళనను ప్రభుత్వం ప్రారంభించిందని భావించాలి. త్వరలో అనేక సంక్షేమ పథకాలను అర్హులకు అందచేయాలంటే సమర్ధులైన అధికారులను నియమించాలన్న కారణంతోనే ఈ బదిలీలు భారీగా జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఒకే సారి 44 మంది బదిలీ


రాష్ట్రవ్యాప్తంగా 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి, ట్రాన్స్ కో సీఎండీగా రోనాల్డ్ రోస్, ఫైనాన్ష్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్‌గా ఏవీ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌.. కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌.. యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌.. అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌.. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ఒకేసారి 44 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ కావడం సచివాలయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు