- డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు రూ. 406 కోట్ల నిధులు
- ఏడాది మొత్తానికి సరిపడా నిధులు ముందే విడుదల
- రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
- సీనియర్ రేసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాఫ్
- నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్
- వైద్య సిబ్బంది ఇబ్బందులు పడకుండా ముందస్తు నిధులు
One year total fund released for Telangana Director of Medicial Education:
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం తాజాగా సోమవారం నిధులను విడుదల చేసింది. 2024-2025 ఏడాది మొత్తానికి సరిపడా నిధులు ముందే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీంతో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాప్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక.. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..పేద ప్రజలకు వైద్య సేవలు అందించే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలన్న ఆలోచనతో.. ఏడాదికి సరిపడా బడ్జెట్ 406.75 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశామన్నారు.
ఉమ్మడి ఆలోచన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అంతా కలిసి ఉమ్మడిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాజా నిర్ణయంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తు గౌరవ వేతనం, ఉపకార వేతనం పొందుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, మెడికల్, నర్సింగ్, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందికి ఇక వేతనానికి సంబంధించిన ఇబ్బందులు ఉత్పన్నమయ్య సమస్యలేదు.