AR Rahman Concert (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

AR Rahman Concert: ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌‌లో ‘పెద్ది’ టీమ్.. ‘చికిరి చికిరి’కి సౌండ్ అదిరింది

AR Rahman Concert: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ (Mega Power Star Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana).. ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్‌ హైదరాబాద్ కాన్సర్ట్‌‌లో (AR Rahman Concer) సందడి చేశారు. రెహమాన్‌ కాన్సర్ట్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అథితులుగా హాజరైన ‘పెద్ది’ టీమ్ రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌, బుచ్చిబాబు సానా ఆడియన్స్‌లో మరింత జోష్‌ నింపారు. ‘పెద్ది’ (Peddi) సినిమాలోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri Song) సాంగ్ తాజాగా విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ లైవ్ పెర్ఫామెన్స్‌‌కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, సౌండింగ్ దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారడంతో.. ‘పెద్ది’ మరోసారి టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Also Read- Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!

‘పెద్ది’తో డ్రీమ్ నెరవేరింది

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్‌ అభిమానులందరికీ నమస్కారం. ‘చికిరి’ సాంగ్ ఎలా ఉంది. మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. రెహమాన్‌ సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్‌ డ్రీమ్. అది నాకు ఎంతో ఇష్టమైన ప్రాజెక్ట్ ‘పెద్ది’తో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుందని అన్నారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫస్ట్ సింగిల్ అందరికీ నచ్చుతుందని, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామని అన్నారు. నాకెంతో ఇష్టమైన రెహమాన్‌తో వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండు రోజుల క్రితం సాంగ్, ఇప్పుడిలా స్టేజ్‌పై ఉన్నందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నానని.. ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా తెలిపారు.

Also Read- Jana Nayagan: ‘జన నాయగన్’ కచేరి లిరికల్ వచ్చేసింది.. ‘భగవంత్ కేసరి’ సాంగ్ దించేశారుగా!

13 దేశాల్లో టాప్‌లో ట్రెండింగ్‌

‘చికిరి’ పాట విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 13 దేశాల్లో టాప్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి.. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి’ సాంగ్.. ఎమోషన్స్, మాస్ అప్పీల్‌‌తో ఆడియో-విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. బాలాజీ అద్భుతమైన సాహిత్యం, మోహిత్ చౌహాన్ మ్యాజికల్ వోకల్స్‌తో సాంగ్ దేశంలోని ప్రతి మూల నుండి ప్రేక్షకులకు ఇన్స్టంట్‌గా కనెక్టైంది. మొదటి 24 గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. దేశవ్యాప్తంగా టాప్‌ చార్ట్స్‌లో నెంబర్‌ 1 స్థానం దక్కించుకుంది. నాలుగు భాషల్లో కలిపి 53 మిలియన్‌ ప్లస్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతకుముందు 13 గంటల్లోనే 32 మిలియన్‌ వ్యూస్‌ సాధించి సౌత్‌ ఇండియా రికార్డు క్రియేట్‌ చేసింది. దాదాపు మిలియన్‌ లైక్స్‌తో అభిమానుల ప్రేమని అందుకుందీ పాట. ముందు ముందు ఇంకెన్ని రికార్డులను చెరిపేస్తుందో చూడాల్సి ఉంది. ‘పెద్ది’ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌‌కు రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?