Thiruveer Aishwarya Rajesh (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో మూవీ ప్రారంభం.. దర్శకుడెవరంటే?

Thiruveer: ఎప్పుడూ రొటీన్ చిత్రాలు కాకుండా.. సినిమాల నెంబర్ తక్కువ ఉన్నా కూడా.. అన్నీ వైవిధ్యమైన సినిమాలు చేసిన హీరో ‘తిరువీర్’ (Thiru Veer). తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ది ప్రీ వెడ్డింగ్ షో’ (The Pre Wedding Show) పాజిటివ్ స్పందనను రాబట్టుకుని థియేటర్లలో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో అలా రిలీజైందో లేదో.. తిరువీర్ తన తదుపరి చిత్రానికి పట్టాలెక్కించారు. తిరువీర్ హీరోగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాతో భరత్ దర్శన్ (Bharat Dharshan) డైరెక్టర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి (Maheswara Reddy Mooli) ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ చిత్రానని నిర్మిస్తున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!

హిలేరియస్ ఎంటర్‌టైనర్‌

గంగాఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘శివం భజే’ (Shivam Bhaje). ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని అందుకుందో తెలిసిందే. మరో ఎక్సయిటింగ్ కథను ప్రేక్షకులకు చెప్పేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. ప్రేక్షకులను వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్, ‘మసూద’ నుంచి ‘ది ప్రీ వెడ్డింగ్ షో’ వరకు డిఫరెంట్ జానర్లలో ఆకట్టుకుంటూ వచ్చారు. ఈ కొత్త సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలలో ఏకకాలంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని, నవంబర్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళతామని ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి తెలియజేశారు.

Also Read- Maganti Legacy Row: జూబ్లీహిల్స్ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మాగంటి గోపినాథ్ తల్లి, కొడుకు సంచలన వ్యాఖ్యలు

ఎం.ఎం. కీరవాణి శిష్యుడు సంగీత దర్శకుడిగా..

ఈ సినిమాకు ట్యాలెంటెడ్ టెక్నికల్ టీమ్ పని చేయబోతోంది. ఆ వివరాలను కూడా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ‘రజాకార్, పోలిమేర’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తుండగా, ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌‌గా, ‘క’ చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌గా, ‘స్వయంభు’ చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తుండగా.. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలన్నింటికి సాహిత్యం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?