Jayakrishna debut movie: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక లాంచింగ్ బాధ్యతను ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తీసుకున్నారు. ఇది ఆయన నాలుగవ చిత్రంగా రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను దర్శకుడు అజయ్ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ఘట్టమనేని ఫ్యాన్ మరో హీరో రాకను సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. నటశేఖర కృష్ణ, సూపర్ స్టార్ మహేశ్ బాబుల సినీ వారసత్వాన్ని జయకృష్ణ కొనసాగించబోతున్నారు. హీరోగా తన మొదటి సినిమా కోసం జయకృష్ణ నటన, ఫైట్స్, డ్యాన్స్ వంటి విభాగాల్లో లండన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఘట్టమనేని కుటుంబానికి తెలుగు చిత్ర పరిశ్రమలో అపారమైన గౌరవం, చరిత్ర ఉన్నాయి. అందుకే ఆయన ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు అజయ్ భూపతి ‘RX 100’ తో తనదైన బోల్డ్, ఇంటెన్స్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ను నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న జయకృష్ణ తొలి చిత్రం కూడా పక్కా యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ప్రేమకథగా ఉండబోతుందని సమాచారం. సినిమా నేపథ్యం తిరుమల కొండలు, పరిసర ప్రాంతాల్లో ఉండే సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ, మట్టి వాసనతో కూడిన కథాంశాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన పోస్టర్లో తిరుమల దేవాలయం ఆకృతి కనిపించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ గతంలో సూపర్ స్టార్ కృష్ణతో ‘అగ్ని పర్వతం’ వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్‌లను నిర్మించారు. అంతేకాకుండా, మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కూడా అశ్వినీదత్ నిర్మాణంలోనే వచ్చింది. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం హీరోను పరిచయం చేయడంలో ఆయన భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెటకొన్నాయి.
Read also-Diwali movies on OTT: ఓటీటీకి క్యూ కడుతున్న దీపావళి సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ సినిమాలో జయకృష్ణ సరసన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఈమెకు కూడా ఇది తెలుగులో తొలి చిత్రమే కావడం మరో విశేషం. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్ వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే హీరోహీరోయిన్లపై ఫోటో షూట్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ ‘ఏబీ4’ (అజయ్ భూపతి 4వ చిత్రం) టైటిల్, మరిన్ని పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
With a Great Story comes Greater Responsibility…
Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film 😇🤩
From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️🔥
Presented by @AshwiniDuttCh
Produced by… pic.twitter.com/Fmn2AoYeEU— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025
