Chikiri song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట కేవలం ఇండియాలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్ గ్లోబల్ చార్టుల్లో అపూర్వమైన రికార్డును నమోదు చేసింది. ‘చికిరి చికిరి’ పాట తెలుగు, హిందీ వెర్షన్లు రెండూ ఒకేసారి యూట్యూబ్ గ్లోబల్ చార్టులలో టాప్ 2 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాయి. ఒకే పాట, రెండు వేర్వేరు భాషల్లో విడుదలైనప్పటికీ, గ్లోబల్ చార్టుల్లో మొట్టమొదటి రెండు స్థానాల్లో నిలవడం అనేది భారతీయ సినీ చరిత్రలో మొదటిసారి జరిగిన సంఘటన. ఈ రికార్డు రామ్ చరణ్ స్టార్‌డమ్‌ను, భారతీయ సినిమా పరిధి ప్రపంచ స్థాయికి చేరుకుందని నిరూపిస్తోంది. దీనిని చూసిన రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ పాట కేవలం చార్టులకే పరిమితం కాలేదు. విడుదలైన 24 గంటల్లోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ (46 మిలియన్లకు పైగా) సాధించిన పాటగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట వ్యూస్ పరంగా రికార్డుల వేటను కొనసాగిస్తోంది. రామ్ చరణ్ గ్రేస్, ఎనర్జీ, నెక్స్ట్ లెవల్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. ప్రతి స్టెప్పులోనూ చరణ్ చూపిన ఉత్సాహం అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దానికి తోడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, మోహిత్ చౌహాన్ అద్భుతమైన గాత్రం పాట స్థాయిని మరింత పెంచాయి. జాన్వీ కపూర్ గ్లామర్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పాటను మరింత అందంగా మలిచాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ పాటను తెరకెకెక్కించిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
Read also-The RajaSaab: ‘ది రాజాసాబ్’ దర్శకుడిపై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకంటే?
పెద్ది సినిమాలో ‘చికిరి చికిరి’ పాట సాధించిన ఈ ఘనత గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ఈ పాట టాలీవుడ్‌కి, ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ వేదికపై పెద్ద గౌరవాన్ని తీసుకువచ్చింది. ఈ పాట సృష్టించిన ప్రభంజనంతో ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘చికిరి చికిరి’ సాధించిన ఈ చారిత్రక రికార్డు ఇండియన్ సినిమాకు ఒక మైలురాయిగా నిలిచి, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలకు మార్గం సుగమం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పాటతో పెద్ది సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి పాటే గ్లోబల్ రికార్డ్ కొట్టిందంటే సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
For the first time ever, a single song is trending at the top 2 spots on YouTube Global Charts 💥💥💥#ChikiriChikiri Telugu & Hindi have conquered the top 2 positions ❤️🔥
Blasting response from all corners 🥳🕺❤️🔥
▶️ https://t.co/bWVCQlNaqD#PEDDI WORLDWIDE RELEASE ON 27th… pic.twitter.com/zG9x61Xd6h
— BuchiBabuSana (@BuchiBabuSana) November 9, 2025
