the-rajasab-song( image :x)
ఎంటర్‌టైన్మెంట్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ దర్శకుడిపై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

The RajaSaab: డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టులపైనే ఉన్నాయి. దర్శకుడు మారుతితో కలిసి చేస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘ది రాజాసాబ్’ ఒకటి. టైటిల్, పోస్టర్లతో అంచనాలు పెంచిన ఈ సినిమాపై తాజాగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ల జాప్యం. ‘ది రాజాసాబ్’ దర్శకుడు మారుతి.. గతంలోనే అభిమానులకు ఒక హామీ ఇచ్చారు. అదేంటంటే, నవంబర్ మొదటి వారంలో సినిమా నుంచి మొదటి పాట ను విడుదల చేస్తామని. అయితే, నవంబర్ మొదటి వారం ముగిసిపోయి దాదాపు రోజులు గడుస్తోంది. అయినా ఇప్పటివరకు ఆ పాట గురించి కనీసం ఒక చిన్న అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడంపై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో మారుతిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Rrad also-Richest actors: సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా.. వారి ఆస్తులు ఎంతంటే?

నిర్మాతలు చిత్ర బృందం అప్‌డేట్ ఇవ్వడంలో ఈ నిర్లక్ష్యం చూపడం ఏమాత్రం సరికాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు సినిమా రిలీజ్ గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో, ముఖ్యమైన అప్‌డేట్‌ను ఇలా వాయిదా వేయడం ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా సాంగ్ విడుదలపై సమాచారం ఇవ్వులని అభిమానులు కోరుకుంటున్నారు.  ‘ది రాజాసాబ్’ సినిమాను రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా అవుతోందంటూ ఇటీవల కొన్ని రూమర్లు వచ్చాయి. దీనిపై సినిమా నిర్మాతలు స్పష్టమైన ప్రకటన ఇచ్చి, వాయిదా వార్తలను ఖండించారు కూడా. అయినప్పటికీ, నవంబర్ మొదటి వారంలో వస్తుందన్న పాట ఇప్పటికీ రాకపోవడంతో.. సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చినా, ఈ అప్‌డేట్ జాప్యం మళ్ళీ ఆ పోస్ట్‌పోన్ రూమర్లకు ప్రాణం పోస్తోందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rrad also-Diwali movies on OTT: ఓటీటీకి క్యూ కడుతున్న దీపావళి సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అప్‌డేట్ విషయంలో ఇంత ఆలస్యం జరగడం సరికాదని, దర్శకుడు మారుతి వెంటనే స్పందించి, అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ సాంగ్ అప్‌డేట్‌పై స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి సినిమాపై ఉన్న అంచనాలను కాపాడటానికి చిత్ర బృందం ఇకనైనా వేగంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వస్తుంది అన్న సాంగ్ కనీసం ఎప్పుడు వస్తుందో చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై దర్శక, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Just In

01

Jubilee Hills By Election: ప్రచారంలో వెనుకంజ.. చివరి రోజైనా సీరియస్‌గా తీసుకుంటారా..?

Stress Relief: మతిమరుపు, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలు పాటించండి!

Sharwanand fitness journey: తన ఫిట్‌నెస్ రహస్యం ఏంటో చెప్పిన హీరో శర్వానంద్.. మార్పుకు కారణం అదే..

Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..

Chikiri song: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్..