diwali-movies-ott( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Diwali movies on OTT: ఓటీటీకి క్యూ కడుతున్న దీపావళి సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Diwali movies on OTT: తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి కనుకగా వచ్చిన మిత్రమండలి, తెలుసుకదా, కె ర్యాంప్, బైసన్, డ్యూడ్ సినిమాలు విడుదలై దాదాపు నాలుగు వారాలు కావస్తుండటంతో ఒక్కొక్కటిగా ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. విడుదలైన మూడు వారాల్లోనే మిత్రమండలి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదలై మంచి టాక్ దూసుకుపోతుంది. ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఇంపేక్ట్ చూపించకపోయినా ఓటీటీలో టాప్ 5 లో ఉంది. ఇదే బాటలో మరో నాలుగు సినిమాలు ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నవంబర్ 14న ఓటీటీలోకి రానుంది. ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ సినిమాలు కూడా నవంబర్ 14 న నెట్ ఫ్లిక్స్ లోకి రానున్నాయి. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ నవంబర్ 15 న ఓటీటీలోకి రానుంది. ఇలా వరుసగా దీపావళికి విడుదలైన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తున్నాయి.

Read also-The Girlfriend- Jatadhara: ఫైడే విడుదలైన సినిమాల రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..

సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.45-50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, సుమారు రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ (లాభాల్లోకి రావాలంటే) కోసం సుమారు రూ.25 కోట్ల షేర్ సాధించాల్సి ఉండగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అంచనాల ప్రకారం, ఈ చిత్రం కేవలం రూ.10-15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఇది సిద్ధు కెరీర్‌లోనే ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది, పెట్టుబడిలో పావువంతు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది.

ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’

తమిళ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ నటించిన ‘డ్యూడ్’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. ఇది తెలుగులోనూ ఘన విజయం సాధించింది. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అంచనాతో విడుదలైన ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ కోసం సుమారు రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి వచ్చింది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అధిగమించినట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనితో ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ తర్వాత మూడవ వరుస రూ.100 కోట్ల గ్రాస్ మూవీని సాధించి, స్టార్ హీరోల రేంజ్‌కు ఎదిగాడు.

Read also-Richest actors: సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా.. వారి ఆస్తులు ఎంతంటే?

కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ ‘కే ర్యాంప్’ దీపావళి రేసులో విజేతగా నిలిచింది. ఈ సినిమాకు సుమారు రూ.8-9 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.9 కోట్ల షేర్ కాగా, విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా నిర్మాతలకు రూ.9 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు నికర లాభం తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Just In

01

Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..

Chikiri song: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్..

Hyundai Venue 2025: హ్యుందాయ్ వెన్యూ 2025 ఎంట్రీతో SUV మార్కెట్లో రగడ.. టాటా, మారుతి, కియా, మహీంద్రాకి గట్టి పోటీ ఇస్తుందా?

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి

Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?