Psych Siddhartha: యంగ్ హీరో శ్రీ నందు (Shree Nandu) ‘సైక్ సిద్ధార్థ’ (Psych Siddhartha)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా (Spirit Media) బ్యాకింగ్‌తో.. వరుణ్ రెడ్డి (Varun Reddy) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ టీజర్‌ను గమనిస్తే..
Also Read- Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో ‘శివ’ వైబ్.. అమల, ఆర్జీవీ ఎంట్రీతో దద్దరిల్లిన హౌస్!
హైపర్ యాక్టివ్
హీరో హైపర్ యాక్టివ్.. ప్రతి చిన్న విషయానికి అనూహ్యంగా స్పందించే యువకుడు. టీజర్ ప్రారంభంలోనే ఆ విషయాన్ని తెలియజేశారు. అతను తన స్నేహితుడితో కలిసి వైల్డ్ కారు జర్నీ చేస్తూ.. చిన్న చిన్న విషయాలపై తన నిరాశను చెబుతుంటాడు. సక్సెస్‌పై నమ్మకం కోల్పోయి.. ఓడిపోయిన వ్యక్తిగా తనను తాను చెప్పుకుంటున్నట్లుగా ఇందులో చూపించారు. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని ఈ కథను రూపొందించినట్లుగా అర్థమవుతోంది. శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో మలిచినట్లుగా ఆయన రగ్గడ్ లుక్, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే తెలుస్తోంది. హైదరాబాద్ యాస, హైపర్ యాక్టివ్ వ్యక్తిత్వాన్ని నందు అద్భుతంగా ప్రదర్శించాడు. టెక్నికల్‌గానూ ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతుందనేది కూడా ఈ టీజర్ తెలియజేస్తుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. రానా స్పిరిట్ మీడియా మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటోంది.
Also Read- UAE Lottery: యూఏఈలో తెలుగోడికి జాక్ పాట్.. రూ.240 కోట్లు సొంతం.. మీరూ గెలవొచ్చు!
ఫ్యామిలీ అంతా మెచ్చే సినిమా
టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ఈ వేడుక మాకు చాలా స్పెషల్. ఈ సినిమా అందరినీ మెప్పించి, సినిమాకు పనిచేసిన అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. ఒక ప్యాట్రన్‌ని బ్రేక్ చేసి ఈ టీజర్ రిలీజ్ చేద్దామని అనుకున్నాం. టీజర్ కట్ కూడా కొత్తగా ఉండాలనే ప్రయత్నంతో ఇలా చేశాం. మా ప్రయత్నం అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఉన్న ఫన్‌ని డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. టైటిల్ అలా ఉన్నా.. ఇది ఫ్యామిలీ అంతా మెచ్చే సినిమా. సురేష్ బాబు, రానా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిలిం మేకింగ్ గ్రామర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమా అంతా నేచురల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. చాలా మంచి సినిమా చేశాం. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలో చూడని ఒక కొత్త కోణాన్ని అంతా చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా దర్శకుడు, హీరోయిన్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
