Bandi Sanjay: రోడ్డు విస్తరణ పేరుతో గోదావరిఖనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు.. మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఇదే అంశంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ గార్లకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని కూల్చామని అధికారులు చెప్పారని.. మరి అదే రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులను ఎందుకు కూల్చలేదని తాను ప్రశ్నించినట్లు తెలిపారు. ఎవరి మెప్పుకోసం మూకుమ్మడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారని నిలదీసినట్లు పేర్కొన్నారు.
హిందువులంటే చులకనా?
‘ఆటో డ్రైవర్లు తమ ఆటో అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారు. భక్తులు నిత్యం దర్శించుకుంటారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తారా? భక్తుల మనోభావాలు పట్టవా? పోనీ అదే రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి వాటినెందుకు కూల్చివేయలేదు? హిందువులంటే అంత చులకనా?’ అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
’48 గంటలు సమయమిస్తున్నా’
గోదావరిఖని యంత్రాంగానికి 48 గంటల సమయమిస్తున్నట్లు బండి సంజయ్ హెచ్చరించారు. కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునర్నిర్మించాలని అల్టీమేటం జారీ చేశారు. లేకపోతే దారికి అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలని సూచించారు. లేనిపక్షంలో తాను గోదావరిఖనికి వచ్చి మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానని అన్నారు.
Also Read: Pawan Kalyan: శేషాచలం అడవుల్లో పవన్.. కాలినడకన 4 కి.మీ ప్రయాణం.. కీలక ఆదేశాలు జారీ
‘అధికారులే బాధ్యత వహించాలి’
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయిన వెంటనే గోదావరిఖనికి వస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ ప్రజల మందు నిలబెడతానని పేర్కొన్నారు. జరగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే అంశంపై పెద్దపల్లి జిల్లా బీజేపీ నేతలతో పాటు రాష్ట్ర నాయకులతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తామని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
రోడ్డు విస్తరణ పేరుతో గోదావరిఖనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదు? ఇదే అంశంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ… pic.twitter.com/sou6iWnjfG
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 8, 2025
