Extensive Inspections In Cyberabad Commissionerate
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Cyberabad: కమిషనరేట్‌ పరిధిలో విస్తృత తనిఖీలు

Extensive Inspections In Cyberabad Commissionerate:సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గతరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ టెస్ట్‌లో ఊహించని స్థాయిలో నేరస్తులు పట్టుబడ్డారు. ఏకంగా 385 మంది నేరస్థులను పట్టుకున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో 292 టూవీలర్, 11 త్రీవీలర్‌, 80 ఫోర్‌ వీలర్‌, 2 భారీ వాహనాల డ్రైవర్లను పట్టుకున్నారు. మరోపక్క ఐటీ కారిడార్‌లో 182 మంది నేరస్థులు పట్టుబడ్డారు.


అత్యధికంగా 550ఎంజీ / 100ఎంఎల్‌ బ్యాక్‌తో నలుగురు నేరస్థులు పట్టుబడ్డారు. పట్టుబడిన నిందితులందరినీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి, ప్రమాదాలకు పాల్పడి ప్రజలను చంపేస్తే, అలాంటి వ్యక్తులను ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ II కింద అరెస్టు చేసి జైలుకు పంపుతారు. దీనికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది.

Also Read: మంత్రిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేకి లీగల్‌ నోటీసులు


రాంగ్ రూట్‌లో డ్రైవింగ్‌ చేసే వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్ కమీషనరేట్‌ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన 114 వాహనాలపై 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అరికట్టడానికి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగనుందని పోలీసులు తెలిపారు. జూన్ 22 నాటికి, సీటీపీ మొత్తం 122 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. ఇందులో రాంగ్ రూట్‌ డ్రైవింగ్ నేరాలకు సంబంధించిన 631 వాహనాలను అదుపులోకి తీసుకుంది.

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?