Legal Notices To The MLA Who Accused The Minister: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద స్కాం చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని ఆరోపించాడు. ఎన్టీపీసీలో నుంచి వస్తున్న యాష్‌ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నాడు. అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమర్శించాడు. ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించాడు.
ఈ నేపథ్యంలో ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై లేనిపోని ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డికి, టీ న్యూస్ ఛానెల్ ఎండీ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లకి అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు లీగల్ నోటీసులు పంపించారు.ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుంది. అది వినియోగించుకోవడానికి వీలుండదు.దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారు.ఈ ఫ్లైయాష్‌ను రోడ్ల నిర్మాణానికి ,బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారు.ఈ ఫ్లైయాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుంది.
Also Read: ఖజానాకు ఇక కాసుల వర్షం
ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుందనేది అన్‌లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది.ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది పోయి హుజురాబాద్‌లో కౌశిక్ లారీలను ఆపి మంత్రిపై ఆరోపణలు చేశారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్ లోడ్‌తో వెళ్తుందని ప్రతి లారికి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారు. ఫ్లై యాష్ అనేది రోజుకు వేల మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయి.దానిని అధికారులు, పంపిస్తున్న ఎన్టీపీసీ చూసుకుంటుంది. అది టెండర్ ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు. కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చేసిన ఆరోపణలు సరికాదని అడ్వకేట్ పూర్ణచందర్ రావు కోరారు.