- త్వరలో ఎల్ఆర్ఎస్ పై గుడ్ న్యూస్ చెప్పనున్న కాంగ్రెస్ సర్కార్
- మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
- ఎల్ఆర్ఎస్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ సర్కార్
- పార్లమెంట్ ఎన్నికలకు ముందే మొదలైన ప్రక్రియ
- జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో దరఖాస్తుల పరిశీలన
- కాంగ్రెస్ సర్కార్ కు భారీగా పెరగనున్న ఆదాయం
- ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆదాయం తప్పనిసరి
- అందుకే ఎల్ఆర్ఎస్ పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్
Telengana Government taking decession on pending applications of LRS:
తెలంగాణలో ఎల్ ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్ అందించబోతోంది. గతంలో దరఖాస్తుచేసుకున్న వాటిని పరిశీలించి దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలయింది. బీఆర్ఎస్ హయాంలో జనం దగ్గర డబ్బులు కట్టించుకుని రెగ్యులైజేషన్ ప్రక్రియను కోర్టు కేసులు పెండింగ్ లో ఉండటంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపేశారు. మళ్లీ మూడేళ్ల తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఇప్పటికే 2020 నుంచి 4.5 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా వాటి ద్వారా హెచ్ఎండీఏకు వెయ్యి కోట్లు, జీహెచ్ఎంసీకి 450 కోట్ల ఆదాయం రావచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనితో రాష్ట్ర సర్కార్ గణనీయంగా ఆదాయం పెంచుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు 25 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం కోసం అంతా ఎదరుచూస్తున్నారు.
స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘట్ కేసర్, శ:షాబాద్ , శంకర్ పల్లి, మేడ్చల్ జోన్ల పరిధిలోని దాదాపు 3.46 లక్షల ప్లాట్ల యజమానులు గత మూడు సంవసరాల కిందట క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ శాతం దరఖాస్తుల్లో ఘట్ కేసర్, శంకర్ పల్లి, శంషాబాద్ ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ భూముల ధరలు కొద్దిగా తక్కువ ఉంటాయి. అందుకే ఆదాయం వెయ్యి కోట్లు దాటకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 50వేల దరఖాస్తుల పరిశీలన మొదలవగా, ప్రక్రియ వేర్వేరు దశల్లో పని ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వారందరికీ మరోమారు మేసేజ్లు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మార్చి నెల చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అధికారులు అటకెక్కిన దస్త్రాలకు బూజు దులుపుతున్నారు.
మూడేళ్ల నిరీక్షణ
బీఆర్ఎస్ హయాంలో 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. . అప్పటి నుంచి మూడేళ్లుగా దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల వల్ల న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. విధానాల రూపకల్పన, న్యాయపరమైన ఇబ్బందులన్నీ పరిశీలించి సాధ్యమైనంత త్వరలోనే ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
మూడు దశలలో పనిచేయాలి
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముందుకు సాగాలంటే మూడు దశల్లో పని చేయాల్సి ఉంటుంది. తొలుత దరఖాస్తులను పరిశీలించాలి. అనంతరం ఆ దరఖాస్తుల్లోని కొలతల పరిశీలనకు క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారు. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం దరఖాస్తుదారు చెల్లించాల్సిన ఫీజును నిర్ణయిస్తారు. ఆ మేరకు దరఖాస్తుదారులకు నోటీసులు పంపుతారు. ఈ నోటీసులను మునిసిపాలిటీలో అయితే అక్కడి అధికారులు, గ్రామ పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా నోటీసులు ఇచ్చేందుకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అదే సమయంలో ఆ నోటీసుల ప్రకారం ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు కొంత సమయమివ్వాలి. ఇది కూడా కనీసం 15 రోజులు ఉంటుంది. అంటే నోటీసులివ్వడం, అందులో పేర్కొన్న ఫీజులు లబ్ధిదారులు చెల్లించడానికి కనీసం నెల రోజుల సమయం కావాలి. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయిన కొన్ని రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ చేసుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు.