Monalisa Bhosle: కుంభమేళాలో (Maha Kumbh Mela) పూసలమ్ముతూ వైరలైన మోనాలిసా (Monalisa Bhosle) గుర్తుందా? తన విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా.. ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘లైఫ్’ చిత్రంతో మోనాలిసా హీరోయిన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. నిర్మాత అంజన్న (Producer Anjanna) నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను కోటపాటి (Srinu Kotapati) దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ సినిమా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. వాస్తవానికి ఆమెను ‘ది డైరీ ఆప్ మణిపూర్’ సినిమా కోసం సనోజ్ మిశ్రా (Sanoj Mishra) సంప్రదించారు. ఆమె ఇంటికి వెళ్లి మరీ పెద్దల్ని ఒప్పించి సినిమా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి మోనాలిసాపై వార్తలు రావడం తగ్గాయి. ఆమె ఏ సినిమాలో నటిస్తుందనేది క్లారిటీ లేకుండా పోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాలోనే అవకాశం దక్కించుకుని సంచలనంగా మారింది.
Also Read- Dharma Mahesh Kakani: రూ. 10 కోట్ల బ్లాక్‌మెయిలింగ్.. భార్య, ఓ ఛానల్ సీఈవోపై హీరో ఫిర్యాదు!
మోనాలిసాను పరిచయం చేయాలనే..
ఇక ‘లైఫ్’ ప్రారంభ విశేషాలకు వస్తే.. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేవంలో నిర్మాత అంజన్న మాట్లాడుతూ.. ఈరోజు సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించాం. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. సరికొత్త ప్రయోగంగా ఈ సినిమాను ఆరంభించాం. కుంభమేళాలో చిన్న వ్యాపారం చేసి.. ఇండియా మొత్తం ప్రజాదరణ పొందిన అమ్మాయితో సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని అనుకున్నాను. అందుకు సరిపడా కథ కోసం చూస్తున్నాను. దర్శకుడు శ్రీను కోటపాటి చెప్పిన కథ నచ్చడంతో మోనాలిసాను హీరోయిన్‌గా ఎంపిక చేసి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆమెను పరిచయం చేస్తున్నాం. ఈ చిత్ర కథ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ఘటన ఆధారంగా ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరికీ ధన్యవాదాలని తెలిపారు.
Also Read- Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే?
చెప్పలేనంత ఆనందంగా ఉంది
దర్శకుడు శ్రీను కోటపాటి మాట్లాడుతూ.. అంజన్నకి కథ చెప్పగానే నచ్చిందని అన్నారు. కానీ, కుంభమేళా మోనాలిసా డేట్స్ తీసుకువస్తే కథకు న్యాయం జరుగుతుందని అనడంతో.. ఆమెను సంప్రదించడం, ఆమె ఓకే చెప్పడం జరిగాయి. ఇది యూత్ ఫుల్ సినిమా. ఇందులో నేటి తరానికి చక్కటి సందేశం కూడా ఇమిడి వుంటుందని అన్నారు. హీరో సాయి చరణ్ మాట్లాడుతూ.. దర్శకుడిని నేను కలిసిన రోజునే కథకు సరిపోతావని చెప్పారు. యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. మోనాలిసా మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. నేను తెలుగు సినిమా చేస్తానని అసలెప్పుడూ ఊహించలేదు. తెలుగు సినిమా చేస్తున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు రాదు కానీ, త్వరలో నేర్చుకుంటా. నేను హీరోయిన్‌గా చేస్తున్న ‘లైఫ్’ సినిమా.. అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని తెలిపారు. ఇందులో సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి వంటి వంటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
