c బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 59వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 59) హౌస్‌లో ఫియర్ మోడ్ ఆన్ అయింది. ఒక్కో కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ భయపెట్టేస్తున్నారు. నామినేషన్స్ రచ్చ అనంతరం జరుగుతున్న ఈ టాస్క్, హౌస్‌మేట్స్‌కి మాత్రమే కాకుండా.. ఈ షోను చూస్తున్న వారికి కూడా ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉందంటే.. హౌస్‌లో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఫియర్ మోడ్ టాస్క్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో వదిలారు. ఈ ప్రోమో చూస్తుంటే.. మరీ ముఖ్యంగా తనూజ, రీతూలను ఏ రకంగా భయపెట్టాలో, ఆ రకంగా భయపెట్టేశారు. అయితే చివరిలో రీతూ మాత్రం నిజంగానే దెయ్యం పట్టిన అమ్మాయిగా బిహేవ్ చేయడం ఏదయితే ఉందో.. అది ఈ ఎపిసోడ్‌కు హైలెట్ అని చెప్పుకోవచ్చు.
Also Read- Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్
ఆడపులి అంటూ వెళ్లి..
ఫియర్ మోడ్ ప్రోమో విషయానికి వస్తే.. సాయి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆదేశాలను చదువుతున్నారు. ‘టీమ్స్‌కి ఇస్తున్న టాస్క్.. టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్. కానీ గుర్తు పెట్టుకోండి. ఈ ప్రక్రయ సమయంలో యాక్టివిటీ ఏరియా చీకటిగా ఉంటుంది’ అని హౌస్ మెంబర్స్‌కి సాయి చదివి వినిపిస్తున్నారు. వెంటనే తన టీమ్ తరపున తనూజ ఈ రూమ్‌లోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టిన వెంటనే భయపడింది. లోపల పుర్రెలు, దెయ్యాల వేషంలో కొన్ని బొమ్మలను సెట్ చేశారు. ఆ గది చాలా భయానకంగా ఉంది. వాటన్నింటినీ దాటుకుని తనూజ.. టాస్క్ ఆడాలి. కానీ ఆమె భయపడిపోయింది. వెంటనే సంచాలక్ సంజనను పిలిచి.. ఆ రూమ్ నుంచి భయంతో బయటపడింది. తనూజ తర్వాత రీతూ తన టీమ్ తరపున ఈ టాస్క్‌లో పాల్గొంది. మొదట భయపడినా.. చివరికి దెయ్యం పట్టిన అమ్మాయిలా.. వికటాట్టహాసం చేస్తుంది. రీతూ అలా ఉంటే, బయట నిలబడి ఉన్న సంజన భయంతో వణికి పోతుంది. ఇక రీతూ వెళ్లే ముందు ఆడపులి అంటూ ఇచ్చిన బిల్డప్ మాత్రం మాములుగా లేదని చెప్పుకోవచ్చు.
Also Read- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!
AAs
8 పాల ప్యాకెట్స్ కొట్టేశారు
హౌస్ మ్యాడ్‌నెస్ అంటూ వచ్చిన రెండో ప్రోమోలో.. రీతూ చౌదరి ఫ్రీజ్ ఓపెన్ చేసి చూసి.. పాలు మొత్తం ఎవరో దొంగతనం చేసినట్లుగా చెబుతుంది. మొత్తం 8 ప్యాకెట్స్ ఉండాలని, ఒక్కటి కూడా లేదని కెప్టెన్ దివ్య, రీతూ, పవన్ ఇళ్లంతా సెర్చ్ చేస్తున్నారు. సంజన ఒకవేళ తీసి ఉంటుందేమో అని భరణి.. మీ పేరు రాకుండా చూసుకుంటాను.. చెప్పండి అని అడుగుతున్నారు. దివ్య హౌస్‌లోని వారందరినీ పాల ప్యాకెట్స్ గురించి అడుగుతుంది. దీనిపై ఇమ్ము కామెడీ చేస్తున్నాడు. అంతలోనే సుమన్ శెట్టి ఇంట్లోకి వస్తుంటే.. సుమన్ అన్నా.. 8 పాల ప్యాకెట్స్ దొంగతనం చేశారు అని భరణి చెబుతుంటే.. నిజమా? అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి.. సుమన్ శెట్టి .. ‘అవునా?’ అని అడుగుతున్నారు. మరో వైపు ఆ పాల ప్యాకెట్స్ తనే దొంగిలించి తాగేస్తున్నట్లుగా కూడా బిగ్ బాస్ చూపించారు. ‘రూ. 10 పోయినాయి అని వెతుకుతుంటే.. బంగారం దొరికిందంట’ అని రాము అంటుంటే.. ‘పాల ప్యాకెట్స్ పోయినాయని వెతికితే.. రెబల్ ఎవరో దొరుకుతారని అంటావా?’ అని రీతూ ప్రశ్నిస్తుంది. చివర్లో సుమన్ శెట్టి చిన్న పిల్లాడి మాదిరిగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తో.. అసలు సిసలు గేమ్‌ని సుమన్ శెట్టి ఇప్పుడే స్టార్ట్ చేశాడని అనిపిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
