CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ (Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఆ బృందం తెలియజేసింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు గాను జర్మనీ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
1000 మందికి ఉద్యోగాలు..
హైదరాబాద్ లో డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీకి చెందిన GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో 1000 మంది ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ బృందం సీఎంకు తెలిపింది. మరోవైపు హైదరాబాద్ ను ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్ లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ ను కోరారు.
హైదరాబాద్‌ను ఇన్నొవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు జర్మనీకి చెందిన ప్రతినిధి బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో… pic.twitter.com/yDNNtDj9Dn
— Telangana CMO (@TelanganaCMO) November 4, 2025
‘జర్మనీ భాగస్వామ్యం అవసరం’
పెట్టుబడుల విషయంలో జర్మనీ భాగస్వామ్యాన్ని తెలంగాణ కోరుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. TOMCOM ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరారు. ఈ భేటీలో డ్యుయిష్ బోర్స్ సీఓఓ డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అమెజాన్ వెబ్ బృందంతో భేటి
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం కూడా భేటి అయ్యింది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎంతో చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఈ భేటిలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్ (Kerry Person), ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.
A delegation from Amazon Web Services (@awscloud) paid a courtesy visit to Hon’ble Chief Minister Shri @revanth_anumula. The delegation held discussions with the Chief Minister regarding ongoing data center projects and AWS’s expansion plans in #Telangana.
✅The delegation… pic.twitter.com/ji1JQ4X9ME
— Telangana CMO (@TelanganaCMO) November 4, 2025
Also Read: Vikarabad Road Accident: తెలంగాణలో మరో ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. పరారీలో డ్రైవర్
జూబ్లీహిల్స్ ప్రచార షెడ్యూల్
మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రహమత్ నగర్ డివిజన్ లో సీఎం పర్యటించనున్నారు. SPR హిల్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్ షో చేయనున్నారు. అనంతరం శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ (పీజేఆర్ సర్కిల్) వద్ద ఓటర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.
