Sfa Srinivas Jobs Fraud In Ghmc
సూపర్ ఎక్స్‌క్లూజివ్

GHMC: ఘరానా మోసం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..

Sfa Srinivas Jobs Fraud In Ghmc:నిత్యం ఏదో ఒక ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దొంగతనాలు అనీ కానీ.. ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తన కిందిస్థాయి ఉద్యోగులను బెదిరించి తమ ఉద్యోగాలను వదిలిపెట్టాలని సతాయించాడు. అంతేకాదు వారి నుండి సంతకాలు చేయించుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. యూసఫ్‌గూడ పరిధిలోని బోరబండ సైట్ 2 లో ఎస్‌ఎఫ్‌ఎ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.తన కింద పనిచేసే కొంతమంది జీహెచ్‌ఎంసీలో పనిచేసే మహిళలను బెదిరించి తమ ఉద్యోగం మాన్పించాలనే ప్రయత్నం చేశాడు.


ఆ తర్వాత వారి స్థానంలో కొత్తవారిని అందులో పెట్టుకునేందుకు శ్రీనివాస్ ఇప్పటికే కొత్త వారి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని వారంతా వాపోయారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే శ్రీనివాస్‌పై ఇటీవల బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. శానిటేషన్ సిబ్బంది రాకపోయినప్పటికీ వారి సంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పనిచేసినట్లుగా సంతకాలు పెట్టుకుని శ్రీనివాస్ వారి జీతాలను కొట్టేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఎస్ఎఫ్ఎ శ్రీనివాస్‌పై తగిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులు బాధితులంతా డిమాండ్ చేశారు.


Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..