- సంకీర్ణ ప్రభుత్వంగా కొలువుదీరిన మోదీ సర్కార్
- లోక్ సభ స్పీకర్ ఎంపిక పై సంధిగ్ధత
- స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్న చంద్రబాబు, నితీష్
- కింగ్ మేకర్ల చూపు స్పీకర్ పదవి వైపు
- సంకీర్ణ ప్రభుత్వాలప్పుడు కీలకంగా వ్యవహరించే స్పీకర్
- ఫిరాయింపుల చట్టం కఠినంగా అమలయ్యేలా చూడటం
- సభను సజావుగా నడిపించేలా చేయడం
- పార్టీలకు అతీతంగా పనిచేయడం
Modi government serching for capable speaker conduct parliament sessions:
మోదీ సర్కార్ ఎట్టకేలకు మూడో సారి కొలువుతీరింది. స్వతంత్ర, సహాయ మంత్రులందరితో కలిసి 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మోదీ 3.0 తర్వాత కొత్తగా జరగబోయే పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అనుభవజ్ణుడైన స్పీకర్ ను ఎంపిక చేయవలసిన బాధ్యత మోదీపై ఉంది. ఇప్పటికే కింగ్ మేకర్స్ అనిపించుకున్న చంద్రబాబు, నితీశ్ కుమార్ ఇద్దరూ లోక్ సభ స్పీకర్ విషయంపై మోదీని ఒత్తిడి చేస్తున్నారు అంటూ మీడియా కోడై కూస్తోంది. స్పీకర్ పదవి అంటే ఆషామాషీ కాదు దీనిని తమ వద్దే వుంచుకుని డిప్యూటీ స్పీకర్ పదవిని ఇతరులకు కట్టబెట్టే ఆలోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.
సంకీర్ణంలో స్పీకర్ కీలకం
భారత రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్ ను నియమిస్తారు. కొత్త ఎంపీలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తదనంతరం లోక్ సభలో సాధారణ మెజారిటీతో లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకోవాల్సివుంుటంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఏవీ లేకపోయినా రాజ్యాంగం, పార్లమెంటరీ నియమనిబంధనలను దృష్టిలో ఉంచుకుని స్పీకర్ ను ఎంపిక చేయాలి. అయితే గత రెండు పర్యాయాలుగా బీజేపీకి సొంతంగా బలం ఉండటం, ఎన్టీఏ భాగస్వామ్య పక్షాల అవసరం లేకుండటం బీజేపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. మిత్ర పక్షాల డిమాండ్లు కూడా మోదీ సర్కార్ పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది.
కింగ్ మేకర్ల చూపు స్పీకర్ వైపు
కేంద్రంలో కింగ్ మేకర్లుగా ఉన్న చంద్రబాబు, నితీశ్ కుమార్ ఇద్దరూ రాజకీయపరంగా అనుభవం ఉన్న నేతలు. ఇలాంటి సంకీర్ణ ప్రభుత్వాలను ఎదుర్కుని నడిపిన సీనియర్లు. స్పీకర్ విషయంలో పట్టుబట్టటానికి కారణాలున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీకర్ పోస్టు అత్యంత కీలకంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలలో పాలకపక్షంపై తిరుగుబాట్లు వచ్చిన విషయం విదితమే. అంతర్గత తిరుగుబాట్లతో ఏకంగా పారర్టీలో చీలికలకు దారితీసిన పరిస్థితులు , పాలక ప్రభుత్వాలు తగిన మెజారిటీ లేక కుప్పకూలిపోవడం చూస్తునే ఉన్నాం. ఇలాంటప్పుడే స్పీకర్ విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఒక పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేవారికి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యులపై అనర్హత వేటు వేసే అత్యం శక్తివంతమైన హక్కు స్పీకర్ కు ఉంటుంది. గతంలో తన పార్టీని బీజేపీ విచ్ఛిన్నం చేసిందంటూ నితీష్ కుమార్ ఆరోపణలు చేశారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తమ పార్టీకి చెందిన వ్యక్తి స్పీకర్ గా ఉంటే బాగుంటుందని చంద్రబాబు, నితీష్ లు ఆలోచిస్తున్నారని రాజకీయ పండితుతు చెబుతున్నారు. స్పీకర్ పదవిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా గెలిచిన పురంధేశ్వరికి ఇవ్వాలనేది మోదీ యోచన. లేకపోతే కనీసం డిప్యూటీ స్పీకర్ పదవినైనా ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది.
స్పీకర్ పదవి.. అత్యంత కీలకం
స్పీకర్ పదవి చాలా కీలకమైనది. అంతే కాదు చాలా క్లిష్టమైనది కూడా అని రాజ్యాంగ నిపుణులు, మేధావులు చెబుతున్నారు. ఎందుకంటే సభను సజావుగా నడిపించే నేర్పు కలిగివుండాలి. అది కూడా పార్టీలకతీతంగా నడపాలి. అన్నిపార్టీలనూ సమానంగా చూడాలి. అందరికీ అవకాశం ఇవ్వాలి. ఒకప్పుడు నాలుగవ లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన కాంగ్రెస్ నేత నీలం సంజీవరెడ్డి స్పీకర్ పదవిని నిష్ఫక్షపాతంగా నిర్వహించడం కోసం ఏకంగా సొంత పార్టీ కాంగ్రెస్ కే రాజీనామా చేశారు. వాస్తవానికి పార్టీకీ రాజీనామా చేయనక్కర్లేదు. విమర్శలకు తావులేకుండా హుందాగా స్పీకర్ పదవిని నిర్వహిస్తే చాలు. గతంలో పీఏ సంగ్మా, సోమనాథ్ ఛటర్జీ, మీరాకుమార్ లాంటి నేతలు స్పీకర్లుగా రాణించారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ సూచనలు పట్టిచుకోలేదని 2008 లో సీపీఎం కు చెందిన సోమనాథ్ ఛటర్జీని ఆ పార్టీ బహిష్కరించింది. సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న బీజేపీకి ఇప్పుడు అత్యంత చాకచక్యంగా నడిపించే స్పీకర్ కావాలి.