King First Look: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు తన 60వ పుట్టినరోజున పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కింగ్’ (King) నుంచి ఫస్ట్ లుక్, ట్రైలర్ టీజర్‌ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
ఫస్ట్ లుక్‌లో డాషింగ్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన కింగ్ ఖాన్
ఫస్ట్ లుక్‌లో షారుఖ్ ఖాన్ “సిల్వర్ ఫాక్స్” స్టైల్‌లో కనిపించాడు. గ్రే హేర్, టాటూలు, సాల్ట్-అండ్-పెప్పర్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. కింగ్ ఆఫ్ హార్ట్స్ సింబల్‌ను మౌత్‌లో ఉంచుకుని, రగ్డ్ బాడీ లాంగ్వేజ్‌తో సూపర్ స్టైలిష్ యాక్షన్ హీరోగా అభిమానులను ఆశ్చర్యపరిచాడు. షేడ్స్, క్రాస్-బాడీ బ్యాగ్, స్టైలిష్ లెదర్ జాకెట్, లైట్ బీర్డ్‌తో SRK లుక్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉండటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఇదే కింగ్ రీ-ఎంట్రీ!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్ రివీల్ టీజర్ లో SRK డైలాగ్ దుమ్మురేపింది
టైటిల్ రివీల్ టీజర్లో షారుఖ్ ఖాన్ చెప్పిన డైలాగ్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పించింది. “ఎన్ని చేశానో గుర్తు లేదు.. మంచి వాళ్లా చెడ్డ వాళ్లా అడగలేదు.. వాళ్ల కళ్లల్లో ఒక్క ఫీలింగ్ మాత్రమే చూశా.. అది వారి చివరి ఊపిరి… నేను దాని కారణం… 1000 నేరాలు, 100 దేశాల్లో పేరున్న దొంగ… కానీ అందరూ ఇచ్చిన పేరు ఒక్కటే .. భయం కాదు, దెహ్షత్ నేను! It’s showtime!” ఈ డైలాగ్ కేవలం యాక్షన్ కాదు, SRK కింగ్‌గా తిరిగి రాబోతున్న శబ్దం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ కాస్ట్ లైన్-అప్
‘కింగ్’ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు ప్రముఖ నటులు జయదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, సౌరభ్ శుక్లా, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మ, రాఘవ్ జుయాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పడుకోన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ “ఒక గురువు (మెంటర్) మరియు శిష్యుడు (డిసైపుల్) ఒక ప్రమాదకరమైన ప్రయాణంలో అడుగుపెట్టి, మానవ పరిమితులను పరీక్షించే సర్వైవల్ జర్నీ”గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. షారుఖ్ ఖాన్‌ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #King, #SRK60thBirthday, #KingIsBack అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. “ఇదే SRK రీబర్త్!”, “Pathaan తర్వాత మళ్లీ ఆ మేజిక్ రాబోతోంది” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
