Bigg Boss Telugu 9: బిగ్ బాస్ సీజన్ 9 చూసే వాళ్ళకి విసుగు వస్తుంది. ఎందుకంటే, మన ఊహించినట్లు అక్కడ ఉండటం లేదు. మొత్తం వారికీ నచ్చిందే చేస్తున్నారంటూ ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే, ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగిన విషయం అందరికి తెలిసిందే. ఈ వారం మాధురి, రీతూ చౌదరి, తనూజ, కల్యాణ్, డిమోన్ పవన్, సంజన, రాము, గౌరవ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, ఇంటి నుంచి వెళ్ళిపోయిన వారిలో ఇద్దర్ని తీసుకుంటామని ముందే చెప్పాడు. ” ఇంటిలో ఉండే హౌస్ మేట్ గా అవకాశం” శ్రీజ, భరణీ ఇద్దరికి ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఈ ఇద్దరికి సంబంధించిన టాస్క్ లు జరుగుతున్నాయి.
ఓట్లు మీరే వేసుకోవచ్చు కదరా బాబు. దానికి ఓటింగ్ పెట్టి ఎందుకు అంత డ్రామా చేస్తున్నారు. చూసే వాళ్ళకి కూడా అస్సలు బాగాలేదు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇంత చెత్త సీజన్ మేము ఎక్కడ చూడలేదంటూ ఒక రేంజ్ లో బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. బిగ్ బాస్ కు బదులు.. అందర్ని ఒకేసారి ఎలిమినేట్ చేసి భరణి గారి కుటుంబమని పెట్టి ముద్ద మందారం సీజన్ 2 సీరియల్ తీయండి. పెద్ద హిట్ అవుతుంది. దివ్య, మాధురి, భరణి, తనూజా మెయిన్ లీడ్స్ లో ఉండాలి. అప్పుడే అందరికీ కనెక్ట్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఫ్లాప్అయిపోతుందని అంటున్నారు.
ఇంకొక నెటిజన్ తనూజా ఫేస్ చూస్తేనే కోపం వస్తుంది ఎప్పుడూ చూసినా కూడా .. ఏదో ఇష్టం లేనట్లు ఉన్నట్లు పెడుతూ ఉంటుంది. ఇంట్లో ఆ ఒక్కరోజు ఆమె వేసిన విజిల్ తప్ప ఇంకేం ఆడింది. అసలు ఇంత వరకు ఒక గేమ్ లేదు ఏం లేదు. అలాంటి వాళ్ళని కూడా ఇంట్లో ఉంచుకుంటారు, సీరియస్ గా ఆడే వాళ్ళని మాత్రం వెళ్లిన మొదటి వారంలోనే ఎలిమినేటట్ చేస్తారు. మళ్ళీ కామనర్స్ అని పేరు పెట్టి, వరుసగా వారినే ఎలిమినేట్ చేస్తారు. మీ ఆట మీరు ఆడుకునే దానికి వందల కెమెరాలను పెట్టి మాకు చూపించి పైకి ఎందుకు షో చేయడం. ఇదంతా స్క్రిప్టెడ్ అని చూసేవాళ్ళకి కూడా అర్థమైదంటూ కామెంట్ రూపంలో తన ఆవేదనను తెలియజేశాడు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				