Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి.. ప్రేక్షకులను భలే బురిడీ కొట్టిస్తున్నారుగా?

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ 9 తెలుగు రియాలిటీ షోకు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఈ షో, తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9) తో మన ముందుకొచ్చింది. మొదటి నుంచి హైప్ ఇచ్చారు కానీ, అంత లేదని అంటున్నారు. ఉహకందని మార్పులు.. ఊహించని మలుపులు అంటూబిల్డ్ అప్ ఇచ్చి, తీరా షో ప్రసారమయ్యే సరికి అలాంటి జోష్ లేదని, ఏదో స్క్రిప్టెడ్ లాగా నడుపుతున్నారని టాక్ వచ్చింది.

అయితే, ఈ సారి కామన్ పీపుల్స్ కి ఛాన్స్ ఇచ్చారు కానీ, వారికీ తగిన నాయ్యం చేయలేదు. ఇంట్లోకి వెళ్లినా కూడా వారి కల కల లాగే ఉంది. ఎందుకంటే, ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్లలో ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు. ఇక్కడ అందరికీ ఒకటే డౌట్ వస్తోంది. ఇది వారు అనుకున్నట్లుగా సాగుతుంది. ప్రేక్షకుల వోటింగ్ ప్రకారం జరగడం లేదని తెలుస్తుంది. ఈ సీజన్లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారని బిగ్ బాస్ బేస్ వాయిస్ తో అంతక ముందు చెప్పాడు. ఎన్నడూ లేనిది బిగ్ బాస్ అలా చెప్పడంతో బుల్లి తెర ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు.

ఈ సీజన్లో ఒకరు బయటకు వెళ్లారు అంటే.. ఇంకొకర్ని ఏదోక రకంగా ఇంట్లోకి రప్పిస్తున్నారు. సరే పోయిన వాళ్ళు పోయారంటే వాళ్ళని అలా వదిలేయకుండా మళ్ళీ ఇంట్లోకి రీ ఎంట్రీ అని చెప్పి వారికీ చెత్త టాస్క్ లు పెట్టి   బిగ్ బాసా లాగా కాకుండా స్క్రిప్టెడ్ లా చేసి పడేస్తున్నారు. ఇలా చేయడంతో  జనాలు కూడా మండి పడుతున్నారు.  అసలు మాకు చెప్పిందేంటి? మీరు చేసేదేంటి? అంటూ రక రకాల పోస్టులు పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే  ప్రేక్షకులు ఈ షో నిర్వాహకుల మీద తిరగబడే అవకాశం ఉంది.

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు