Shamshabad | మలేషియా విమానానికి తప్పిన ముప్పు
Major Accident Hyderabad Kaulalumpur Airlines Flight Escaped Passengers
Top Stories

Shamshabad: మలేషియా విమానానికి తప్పిన ముప్పు

Major Accident Hyderabad Kaulalumpur Airlines Flight Escaped Passengers: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఎయిర్‌లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కౌలాలంపూర్‌ మలేషియాకి వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గుర్తించిన పైలట్‌ వెంటనే ల్యాండింగ్‌ కోసం ఏటీసీని అనుమతి కోరారు.

ప్రమాద తీవ్రతను ఐడెంటీపై చేసిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ల్యాండింగ్‌కు అనుమతిని ఇచ్చారు. ఈ గ్యాప్‌లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు వచ్చారు. ఈ విమానంలో సిబ్బందితో సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎక్స్ ట్రా..క్యాబినెట్

విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో విమానంలో ప్రయాణించే ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య