- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు..
- మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు
- ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు 8 చోట్ల కొనసాగుతున్న సోదాలు..
- సంతోష్ గ్రానైట్ కంపెనీలో కొనసాగుతున్న సోదాలు..
- లగ్గారం కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు..
- మధుసూదన్ రెడ్డి తోపాటు మైపాల్ రెడ్డి పై కేసు నమోదు ..
- ఆర్డిఓ నేతృత్వంలో జరిగిన విచారణ
- పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు
- బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు
- రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతోటి పెట్టుబడులు
ED attacks on BRS mla mahipal reddy house and binami properties:
పటాన్ చెరు, స్వేచ్ఛ:
పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉదయం నుంచి పటాన్ చెరు పట్టణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా మొత్తం ఎనిమిది ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే లగ్గారం గ్రామ సమీపంలో ఉన్న కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఇప్పటికే మధుసూదన్ రెడ్డితో పాటు మైపాల్ రెడ్డిపై కేసు నమోదైన విషయం విదితమే.
బినామీ పేర్లతో ఆస్తులు
ఉదయం 6 గంటలకే పటాన్ చెరు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సోదరుడి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డిఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్ గుర్తించారు. లగ్డారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేపట్టిన ఈ డి అధికారులు. పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.. బినామీ పేర్లతోటి మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్లు ఈ డి. అధికారులు గుర్తించారు.