Singareni Collieries (imagecredit:twitter)
తెలంగాణ

Singareni Collieries: సింగరేణిలో మెగా జాబ్ మేళా.. 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

Singareni Collieries: ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి స్వప్నం. తగిన విద్యార్హతలు ఉన్నా, హైదరాబాద్(Hyderabad) నగరంలో కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం లభిస్తుందన్న హామీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువత ముంగిటకే హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి, వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కల్పిస్తోంది. నిరుద్యోగుల ముఖాలపై వెలుగులు నింపుతూ, సింగరేణి గత ఆరు నెలలుగా మెగా ఉద్యోగ మేళాల రూపంలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వీరామంగా కొనసాగిస్తోంది. దాదాపు24 వేల మంది యువతకు కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపుతోంది.

పెద్ద ఎత్తున ఉద్యోగాలు..

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం.. మెగా జాబ్ మేళాల నిర్వహణతో కార్యరూపం దాల్చి విజయవంతంగా నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మల్లు ఆలోచనలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో గత ఆరు నెలల కాలంలో 7 పట్టణాలలో జాబ్ మేళాలు నిర్వహించింది. 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వీరిలో 23,650 మందికి ఉద్యోగాలు కల్పించింది. జాబ్ మేళాలు భారీ ఎత్తున నిర్వహించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించింది. 7వ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలున్న వారితో పాటు, టెక్నికల్, మెడికల్(Medical), పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం దక్కింది. హైదరాబాద్(Hyderabad) ప్రాంతం నుంచి ఒక్కొక్క జాబ్ మేళాలో 100 నుంచి 250 వరకు పలు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. విస్తృత ప్రచారం కల్పించడంతో ఈ జాబ్ మేళా కార్యక్రమాలు మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న యువతను విశేషంగా ఆకర్షించాయి. యువతీ యువకులు వేలాదిగా తరలి రావడంతో పట్టణ ప్రాంతాలు ఒక ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Also Read: Trains Cancelled: మెుంథా తుపాను ఎఫెక్ట్.. విశాఖ మీదగా వెళ్లే 43 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే!

ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో..

ఈ జాబ్ మేళాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీంతో ప్రతీ గ్రామంలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ జాబ్ మేళాను ఏప్రిల్ 21న మధిర నుంచి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు సారథ్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 5,000 మంది పాల్గొనగా 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి. అదే నెల 27న భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,500 మంది పాల్గొనగా 2,000 మందికి ఉద్యోగాలు లభించాయి. మే 18న గోదావరిఖనిలో నిర్వహించిన జాబ్ మేళాలో 5,100 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 3,029 మందికి ఉద్యోగాలు లభించాయి. మే 24న వైరాలో భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో నిర్వహించిన జాబ్ మేళాలో 12,000 మందికి పైగా పాల్గొనగా 4,041 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ నెల (అక్టోబర్) 25న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హుజూర్ నగర్ లో నిర్వహించిన జాబ్ మేళాలో 20,500 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 4,574 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈనెల 26న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మొత్తం 14,318 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా వీరిలో 4,611 మందికి ఉద్యోగాలు లభించాయి. అదే రోజు బెల్లంపల్లిలో జరిగిన మెగా జాబ్ మేళా లో 6,547 మ

సింగరేణి ఎండీ బలరాం

జాబ్ మేళా కార్యక్రమాలకు సింగరేణి సంపూర్ణ సహకారం అందించింది. స్టాల్స్ ఏర్పాటు, ప్రచారం, భోజనం, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రైవేటు కంపెనీల ప్రతినిధులకు సౌకర్యాలు, మంచినీటి వసతి, సింగరేణి అధికారులు ,ఉద్యోగులు, సింగరేణి సెక్యూరిటీ , రెస్క్యూ విభాగంసేవలందించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో కూడా సింగరేణి ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే సామాజిక బాధ్యత కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ప్రత్యేకంగా ఉద్యోగ మేళాలకు సంస్థ సంపూర్ణ సహకారం అందించనుందని, స్థానిక యువతకు, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి తన వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read: Cyclone Montha: మొంథా అంటే అర్థం ఏమిటి? ఈ పదాన్ని ఎవరు సూచించారో తెలుసా?

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ