Weather Update (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

Weather Update: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఇవాళ తీవ్ర తుపానుగా మారనున్నది. కాకినాడ, యానాం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తుపాను తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

దీని ప్రభాంవంతో గరిష్టంగా..

మచిలీపట్నానికి దక్షిణం నుండి ఆగ్నేయంగా 190 కి.మీదూరంలో, కాకినాడకు దక్షిణం నుండి ఆగ్నేయంగా 270 కి.మీ మరియు వైజాగ్‌కు దక్షిణం నుండి ఆగ్నేయంగా 340 కి.మీ దూరంలో ఉదయం 5.30 గంటలకు దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ చుట్టూ మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య తీవ్రమైన తుఫానుగా మారనుంది. అనంతరంద దీని ప్రభాంవంతో గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని IMD తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

జిల్లాల్లో భారీ వర్షాలు

తుపాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల్లో భారీగా కనిపిస్తున్నది. గుంటూరు(Gunturu), బాపట్ల(Bapatla), ఎన్టీఆర్(NTR), పల్నాడు(Plnadu), పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రాత్రికి తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రతీ గంటకు తుపాను కదలికలను గమనిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి.

Also Read: Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

19 కోట్ల విడుదల

తుపాను నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు చేశారు. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేశారు. 57 తీర ప్రాంత మండలాల్లో 219 తుపాను షెల్టర్లు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుపాను తీవ్రతను అంచనా వేసేందుకు 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం(Srikakkulam) నుంచి కోనసీమ(Konsema) దాకా హై అలర్ట్(High alert) కొనసాగుతున్నది.

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ(Telangana)లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నల్లగొండ(Nalgonda), సూర్యాపేట(Surapeta), నాగర్ కర్నూల్(Nagarkarnul), మహబూబాబాద్(Mahabubabad) జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడ్డాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డట్టు అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో రెండు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు(Mulugu) జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో(Yellow) అలర్ట్ జారీ అయింది. మొత్తం 19 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. నిర్మల్(Nirmal), మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Also Read: ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్