Highest Paid Actors: రెమ్యునరేషన్ల విషయంలో మన తెలుగు హీరోలు బాలీవుడ్ యాక్టర్లతో పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలు ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ లిస్ట్ లో మన వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఆ హీరోలేవరో ఇక్కడ తెలుసుకుందాం..
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు భారతదేశంలో టాప్ పారితోషికం తీసుకునే నటుడిగా ఓ రేంజ్‌లో వెలుగొందుతున్నాడు. అతని నెట్‌వర్త్ దాదాపు రూ. 350 కోట్లు. 2021లో మన ముందుకొచ్చిన తెలుగు సినిమా పుష్ప: ది రైజ్ లో అతని నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప: ది రూల్ – పార్ట్ 2 బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ రికార్డులను సైతం ఈ సినిమా బద్దలు కొట్టింది. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 300 కోట్లు తీసుకున్నాడని టాక్. దీంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచాడు, అంతేకాదు టాప్ 10 నటుల లిస్ట్‌లోనూ చోటు సంపాదించాడు.
ప్రభాస్
ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు భారతదేశంలో అత్యంత పాపులర్ నటుల్లో అతనూ కూడా ఒకడు. అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ప్రభాస్ పేరు కూడా ఉన్నాడు. తన పవర్‌ఫుల్ రోల్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందర్ని ఆకట్టుకున్నాడు. ఒక్క సినిమాకి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు చార్జ్ చేస్తాడు. అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి. ఆ సినిమా తర్వాత అతని ఫేమ్, సంపద డబుల్ అయ్యాయి.
అజిత్ కుమార్
సినీ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భారతదేశంలో టాప్ 10 అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఉన్నాడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నాడు. అతని సినిమాలు థియేటర్లలోనూ, బాక్సాఫీస్‌లోనూ బాగా ఆడతాయి. దాదాపు రూ. 196 కోట్ల నెట్‌వర్త్‌తో, అతను ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ నటుల్లో ఒకడు. ఒక్క సినిమాకి రూ. 105 కోట్ల నుంచి రూ. 165 కోట్ల వరకు తీసుకుంటాడు.
రజనీకాంత్
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు ఎన్నో రికార్స్డ్ ను బ్రేక్ చేశాయి. భారతదేశంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా లక్షలాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఎన్నో ఏళ్లుగా తమిళ సినిమాల్లో ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. రజనీ పేరు చెప్పగానే సినిమా థియేటర్ల వైపు జనం పరుగులు పెడతారు, ఆయనకు అంత క్రేజ్ ఉంది. అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా, ఒక్క సినిమాకి రూ. 125 కోట్ల నుంచి రూ. 270 కోట్ల వరకు చార్జ్ చేస్తాడు.
