Killer Movie: టాలీవుడ్ లో ప్రత్యేకంగా ఆలోచించే వారికి ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా…విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
Read also-Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..
ఈ రోజు “కిల్లర్” మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీగా “కిల్లర్” ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో.. ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. త్వరలోనే “కిల్లర్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు విడుదల కావాల్సి ఉంది.సినిమాటోగ్రఫర్ గా జగదీశ్ బొమ్మిశెట్టి వ్యవహరిస్తున్నారు.ఆశీర్వాద్ , సుమన్ జీవ మ్యూజిక్ అందిస్తున్నారు. వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ మేనేజర్ గా మెర్జ్ ఎక్స్ఆర్ ఉన్నారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణ లో థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ. బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు.
Read also-Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?
టాలీవుడ్‌లో కొత్త దర్శకులు తమ ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారిలో ఒకరు సుకు పూర్వాజ్. “శుక్ర” (2021) “మాటరాని మౌనమిది” (2022) చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. స్థానిక సినిమాలకు బహుళ జానర్‌లను మిక్స్ చేసి, ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలు తీర్చిదిద్దటంలో అతనికి ప్రత్యేక ప్రతిభ ఉంది. టాలీవుడ్ కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈయన సినిమాలు మంచి చాయిస్ గా నిలుస్తాయి. సుకు పూర్వాజ్ వంటి దర్శకులు టాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. అతని చిత్రాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి.
