Kishan Reddy: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా రెండేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 11.51 లక్షల మంది యువతకు అపాయింట్ మెంట్ లెటర్లు అందజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. కింగ్ కోటి లోని భారతీయ విద్యా భవన్ లో శుక్రవారం జరిగిన 17వ రోజ్ గార్ మేళాకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురికి నియామక పత్రాలు అందజేశారు.
నేడు దేశంలో 100కు పైగా..
ప్రధాని మోడీ స్వప్నమైన వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలను చేరుకోవడంలో వీరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం వేచి చూడటం కంటే.. ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలన్నది మోడీ(Modhi) ఆలోచన అని వివరించారు. అందుకే 2014లో 350 ఉన్న స్టార్టప్ లు ఉంటే 2024 నాటికి 1.5 లక్షలకు పెరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. నేడు దేశంలో 100కు పైగా యూనికార్న్ స్టార్టప్‌లున్నాయని, వీటి ద్వారా 17 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. 50 వేల స్టార్టప్ లకు మహిళా డైరెక్టర్లున్నారన్నారు.
Also Read; Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదం.. మెదక్ జిల్లాకు చెందిన తల్లి, కూతురు సజీవ దహనం!
ఇంజనీరింగ్ కాలేజీలో..
మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా స్వదేశీ సాంకేతికతతో యుద్ధ ట్యాంకులు, మిసైళ్లు, ఫైటర్ జెట్స్, ఆర్టిలరీ, సబ్ మెరైన్స్ వంటివి సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నామన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కషన్ రెడ్డి విదేశీ విద్యార్థులతో కలిసి దీపావళి సంబురాల్లో పాల్గొన్నారు. వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విదేశీ విద్యార్థులతో కలిసి టపాసులు కాల్చారు.
Also Read: Warangal Gurukulam: గురుకులంలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. అధికారాల తీరుపై స్థానికుల ఆగ్రహం!

