Kishkindhapuri (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Kishkindhapuri: ఓటీటీలో ‘కిష్కింధపురి’ రాకింగ్.. అతి తక్కువ టైమ్‌లోనే..!

Kishkindhapuri: సెప్టెంబర్ హిట్ మూవీస్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ‘కిష్కంధపురి’ (Kishkindhapuri) కూడా ఒకటి. భారీ పోటీ మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుని, బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలబడింది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం‌లో వచ్చిన ఈ హారర్-థ్రిల్లర్ థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసినట్లే ఇప్పుడు ఓటీటీలోనూ రాకింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తోంది. అందరికీ థియేటర్లో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి జీ5 ఓటీటీ (Z5 OTT)లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో అతి తక్కువ సమయంలో 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోందని.. సదరు ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.

Also Read- Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. ఫ్యూజులు ఎగిరే విషయం చెప్పిన.. కర్నూలు జిల్లా ఎస్పీ!

100 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్

ఈ మధ్య కాలంలో జీ5 ఓటీటీలో వచ్చిన సినిమాలు రికార్డులను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి, జీ5 ఓటీటీలో వచ్చిన సినిమాలు తక్కువ సమయంలోనే 100 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడా జాబితాలోకి ‘కిష్కింధపురి’ కూడా చేరింది. రేడియో స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడంతో పాటు.. వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడా సన్నివేశాలకు ఓటీటీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతుండటంతో.. ఈ సినిమా డిజిటల్‌గానూ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.

Also Read- Akhanda 2 Thaandavam: ‘బ్లాస్టింగ్ రోర్’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘కిష్కంధపురి’ కథ ఇదే..

రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమించుకుంటూ ఉంటారు. వారు ఇంకొంత మందితో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ నిర్వ‌హిస్తుంటారు. ఈ క్రమంలో వారు కిష్కింధ‌పురిలోని సువ‌ర్ణ‌మాయ అనే రేడియో స్టేష‌న్‌ టూర్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఆ రేడియో స్టేషన్‌లోకి ఎవరు వెళ్లినా చనిపోతుంటారు. అక్క‌డ ఉండే దెయ్యం ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌న‌ని వార్నింగ్ ఇవ్వడమే కాకుండా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు వెళ్లిన వారిలోని ముగ్గుర్ని చంపేస్తుంది. నెక్ట్స్ టార్గెట్‌గా ఓ చిన్నపాప‌ను ఆ దెయ్యం టార్గెట్ చేస్తుంది. అది తెలుసుకున్న హీరో ఏం చేశాడు? పాప‌ను ఎలా రక్షించాడు? అస‌లు రేడియో స్టేష‌న్‌లోని దెయ్యానికి ఉన్న కథ ఏమిటి? ఎందుకు మ‌నుషుల్ని చంపుతుంది? అనేది తెలుసుకోవాలంటే హార‌ర్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క‌ల‌యిక‌లో వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే. ఉత్కంఠభరితమైన స‌న్నివేశాలు, భ‌యాన‌క‌మైన దృశ్యాలు, ఊహించని కథాంశంతో హర్రర్ ప్రియులకు అద్భుతమైన ట్రీట్ అనేలా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?