Akhanda 2 Thaandavam (Image Source: Youtube)
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2 Thaandavam: ‘బ్లాస్టింగ్ రోర్’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Akhanda 2 Thaandavam: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapatri Srinu) డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్‌లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam). ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అఖండ 2’ టీజర్‌ భారీ బజ్ క్రియేట్ చేసి, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేయగా.. తాజాగా మూవీ నుంచి ‘బ్లాస్టింగ్ రోర్’ (Blasting Roar) అంటూ ఓ డైలాగ్ గ్లింప్స్ వదిలారు. ఇది, ఎప్పటిలానే బాలయ్య మార్క్ పవర్ ఫుల్ మాస్‌ని ప్రజంట్ చేస్తోంది.

Also Read- Allu Arjun: మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్.. ‘కాంతార: చాప్టర్ 1’పై ఐకాన్ స్టార్ రివ్యూ

సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో

ఈ ‘బ్లాస్టింగ్ రోర్’‌ని గమనిస్తే.. సెన్సేషనల్ కంపోజర్ థమన్ మరోసారి తాండవం ఆడేశాడనేది ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. బాలయ్యని రౌండప్ చేస్తూ విలన్లు చుట్టు ముట్టగా.. బాలయ్య హై ఎనర్జీ మాస్ డైలాగ్‌తో ఊచకోత మొదలు పెట్టారు. ఓ విలన్ అరేయ్ అని అరవగా.. ‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో.. నాకే తెలియదు కొ*కా.. ఊహకు కూడా అందదు’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు. రెండు గుర్రాలు మీదకు వస్తుండగా.. ఒకే ఒక్క అడుగుతో అవి అదిరి పడ్డాయి. ఇది బాలయ్య‌లోని వీర తాండవం అని మేకర్స్ పరిచయం చేశారు. మొత్తంగా అయితే బోయపాటి మార్క్‌తో, బాలయ్య మాస్ గ్రేస్‌తో థమన్ హై స్టాండర్డ్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ ‘బ్లాస్టింగ్ రోర్’‌.. నిజంగా గర్జించేలా ఉంది. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవంటే నమ్మాలి మరి. ఈ ఊపుతో డిసెంబర్ 5 కోసం ఫ్యాన్స్‌ని, ప్రేక్షకులను వెయిట్ చేసేలా చేసింది.

Also Read- Samyuktha: ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌.. ఎన్ని సినిమాలు చేస్తుందో తెలుసా?

 

‘అఖండ’ ప్యాట్రన్‌లోనే

ఇప్పటి వరకు అఘోరా పాత్రనే పరిచయం చేసిన మేకర్స్.. ఈ బ్లాస్టింగ్ రోల్‌లో మరో బాలయ్యని పరిచయం చేశారు. సేమ్ ‘అఖండ’ ప్యాట్రన్‌లోనే బోయపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నాడనేది ఈ రోర్‌తో అర్థమవుతోంది. మరి ఇందులో ఉన్న కథాంశం ఏంటనేది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. హర్షాలి మల్హోత్రా మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. పవర్ ఫుల్ టీమ్, భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ ‘అఖండ 2: తాండవం’ గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోందనేది, ఇప్పుడొచ్చిన బ్లాస్టింగ్ రోర్ మాత్రమే కాదు.. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా తెలియజేస్తున్నాయి. చూద్దాం మరి.. పాన్ ఇండియా వైడ్‌గా బాలయ్య అసలు సిసలైన తాండవం ఎలా ఉండబోతుందనేది..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?