Allu Arjun on Kantara Chapter 1 (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్.. ‘కాంతార: చాప్టర్ 1’పై ఐకాన్ స్టార్ రివ్యూ

Allu Arjun: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ స్పందనను రాబట్టుకుని, సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 1000 కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాను చూసిన వారంతా, సినిమాపై, అలాగే సినిమాను రూపొందించిన, ఇందులో ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాస్త ఆలస్యంగా ఈ సినిమాను చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దాదాపు సినిమాపై ఆయన రివ్యూనే ఇచ్చేశారు. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా చూసిన తర్వాత తాను ‘ట్రాన్స్’లోకి వెళ్ళిపోయానంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Also Read- Samantha: సైలెంట్‌గా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ మొదలు.. సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్!

వన్-మ్యాన్ షో

ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి ‘కాంతార చాప్టర్ 1’ చూశాను. వావ్, ఇదొక మైండ్-బ్లోయింగ్ ఫిల్మ్. సినిమా చూస్తూ నేనొక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ‘వన్-మ్యాన్ షో’ చేసిన రిషబ్ శెట్టి‌కి ప్రత్యేక అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు. ముఖ్యపాత్రల్లో నటించిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), జయరామ్ (Jayaram), గుల్షన్ దేవయ్యలతో పాటు ఇతర నటీనటులు అత్యద్భుతమైన నటనను కనబరిచారు. అలాగే సాంకేతిక నిపుణుల పనితీరు బేషుగ్గా ఉంది. ముఖ్యంగా, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ (Aravind S Kashyap) సినిమాటోగ్రఫీ, ధరణి గంగేకర్ ఆర్ట్ డైరెక్షన్, అర్జున్ రాజ్ (Arjun Raj) స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి.

Also Read- Upasana: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న ఉపాసన.. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్!

మాటలు సరిపోవడం లేదు

చివరగా, నిర్మాత విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలిమ్స్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సినిమా చూసిన అనుభవాన్ని మాటల్లో వర్ణించడానికి తన వద్ద పదాలు సరిపోవడం లేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, ఈ అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు. ఈ సినిమా చూశాక, సినిమాపై, టీమ్‌పై బోలెడంత ప్రేమ, ఆరాధన, గౌరవం పెరిగింది’ అంటూ తన పోస్ట్‌ను ముగించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (2022లో వచ్చిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్) ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్‌గా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ వంటి అగ్ర నటుడి ప్రశంసలు ఈ సినిమాకు మరింత బూస్ట్‌ ఇచ్చాయని చెప్పొచ్చు. అల్లు అర్జున్‌కు చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపింది. సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 818 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?