Gaddam Prasad Kumar (imagecrdit:twitter)
తెలంగాణ

Gaddam Prasad Kumar: నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

Gaddam Prasad Kumar: ప్రస్తుత రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speekar Gadam Prsada Kumar) శుక్రవారం(ఈ నెల 24న) విచారణ చేయబోతున్నారు. కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ (సీపీఏ) సదస్సులో పాల్గొనేందుకు ఉత్తర అమెరికా దేశం బార్బడోస్‌కు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గురువారం హైదరాబాద్‌(Hyderabada)కు చేరుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు(Supreme Cot) ఆదేశాల నేపథ్యంలో గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ స్పీకర్‌ సెప్టెంబర్‌ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు.

న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామినేషన్‌

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు సంబంధించి మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అయితే ఈ నెల 4వ తేదీ వరకు ఇరు పక్షాల ఎమ్మెల్యేల వాదనలు విన్న స్పీకర్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మౌఖిక వాదనలు వినిపించేందుకు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. దీంతోవిచారణను స్పీకర్ శుక్రవారం ప్రారంభిస్తున్నారు.

Also Read: Naga Vamsi: ఆయన్ని నమ్మినందుకు మొత్తం ముంచేశారన్న నిర్మాత నాగవంశీ.. ఎవరంటే?

ఇప్పటివరకు స్పందించని దానం, కడియం

పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా వీరిలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ షెడ్యూలు మాత్రమే స్పీకర్‌ గతంలో ప్రకటించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్‌ సంజయ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిటిషన్లపై ఈ నెలాఖరులోగా స్పీకర్‌ విచారణ షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోర్టు విధించిన అక్టోబర్‌ 30 గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పక్రియ ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు స్పీకర్‌ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ వరకు ఇప్పటి వరకు స్పందించలేదని సమాచారం.

గడువు కోరాలనే యోచనలో స్పీకర్‌..

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తమ వివరణ ఇచ్చి ఉంటే సంబంధిత కాపీలు తమకు అంది ఉండేవని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం వర్గాలు వెల్లడించాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసేందుకు మరికొంత గడువు కోరాలనే యోచనలో స్పీకర్‌ కార్యాలయం ఉన్నటు​ సమాచారం. ప్రతి కేసులో ఇరు వర్గాలు (పిటిషనర్లు, ప్రతివాదులు) తమ వాదనలు వినిపించనున్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ. ప్రకాష్ గౌడ్(Prakash Goud) కేసు విచారణ, మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య , మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, మూడు గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈనెల 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.

Also Read: Pamela Satpathy: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలి : కలెక్టర్ పమేలా సత్పతి

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?