Samyuktha (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Samyuktha: ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌.. ఎన్ని సినిమాలు చేస్తుందో తెలుసా?

Samyuktha: టాలీవుడ్‌లో మలయాళ నటీమణులకు ఉండే ప్రత్యేక స్థానం గురించి తెలిసిందే. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని నిలబెడుతూ, స్టార్ హీరోయిన్ సంయుక్త (Samyuktha) తనదైన ముద్ర వేస్తున్నారు. ఒకప్పుడు అనుష్క, నయనతార, సమంత, పూజా హెగ్డేల హవా నడిచినప్పటికీ, ప్రస్తుతం సంయుక్త మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే, వెంటనే వినిపించే పేరు సంయుక్తదే అనడంలో సందేహం లేదు. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతూ, సంయుక్త తన డైరీని దాదాపు రెండు, మూడేళ్ల పాటు ఫుల్ చేసుకున్నారు. ఇది ఆమెకున్న డిమాండ్‌ను, స్టార్‌డమ్‌ను స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా పది వరకు ప్రాజెక్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ ఒక్కోటి ఒక్కో జానర్‌లో ఉండడం విశేషం.

Also Read- Prabhas Spirit: ట్రీట్ అదిరింది.. బొమ్మ కనబడలేదు కానీ.. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ మాస్ వైలెంట్!

సంయుక్త కెరీర్ హైలైట్స్

సంయుక్త ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా పరిశీలిస్తే, ఆమె అన్ని భాషల్లోనూ, ప్రముఖ దర్శకులు, నటులతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పటికే ఆమెకు టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే పేరుంది. ఈ పేరుతో వరసగా ఆమె సినిమాలను సైన్ చేసుకుంటూ బిజీ తారగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల వివరాలకు వస్తే..

అఖండ 2: నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అఖండ 2’ వంటి భారీ సీక్వెల్‌లో ప్రగ్యాని రిప్లేస్ చేసి మరీ అవకాశం దక్కించుకుంది.
నారి నారి నడుమ మురారి: శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఆమె నటిస్తున్నారు.
పూరిసేతుపతి సినిమా: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న సినిమాలో సంయుక్త నటిస్తున్న విషయం తెలిసిందే.
స్వయంభూ అండ్ హైందవ: తెలుగులో నిఖిల్ ‘స్వయంభూ’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులలోనూ ఆమె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ది బ్లాక్ గోల్డ్: ఈ వైవిధ్యభరితమైన ప్రాజెక్ట్‌‌ లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపుదిద్దుకుంటోంది.
ఇతర భాషల చిత్రాలు: మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న ‘రామ్’ మూవీతో పాటు, రాఘవ లారెన్స్ హీరోగా లోకేష్ కనగరాజ్ స్టోరీ అందిస్తున్న ‘బెంజ్’ సినిమాలోనూ ఆమెకు అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది.
బాలీవుడ్ ఎంట్రీ: సంయుక్త బాలీవుడ్‌లో ‘మహారాణి’ అనే సినిమాతో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Samantha: సైలెంట్‌గా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ మొదలు.. సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్!

ఇలా.. దాదాపు పది సినిమాలకు కమిటై, ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్న సంయుక్త, ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ, తన ప్రతిభతో స్టార్ హీరోల చిత్రాలకు కూడా గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా తన సత్తా చాటుతోంది. ఈ అంకితభావం, భారీ ప్రాజెక్టుల ఎంపిక ఆమెను ప్రస్తుత తరం హీరోయిన్లలో అత్యంత బిజీ స్టార్‌గా మార్చిందని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి వీటిలో ఎన్ని విజయవంతమై, ఆమెకు మరింత పేరు తీసుకు వస్తాయో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!