Prabhas Spirit: ట్రీట్ అదిరింది.. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ మాస్ వైలెంట్!
Prabhas and Sandeep Reddy Vanga (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Prabhas Spirit: ట్రీట్ అదిరింది.. బొమ్మ కనబడలేదు కానీ.. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ మాస్ వైలెంట్!

Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spririt). తాజాగా, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ (One Bad Habit Glimpse)ను విడుదల చేశారు. బొమ్మ కనబడలేదు కానీ.. టైటిల్ కార్డ్స్‌తో కేవలం ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో, ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా స్టైల్లో అదిరిపోయే ట్రీట్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ అంటూ వచ్చిన ఈ గ్లింప్స్ మొత్తం ఇంటెన్స్, వైలెంట్ వాతావరణాన్ని చూపించింది.

Also Read- Samantha: సైలెంట్‌గా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ మొదలు.. సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్!

యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా

ప్రభాస్ ఇంట్రడక్షన్: ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రను ఒక నిజాయితీ గల, సిన్సియర్‌ ఐపీఎస్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు. ఎవడ్రా వీడు.. అని ఒక వాయిస్ వినబడగానే కొత్త ఎంట్రీ అంటూ మరో వాయిస్ సమాధానమిచ్చింది. ఇది నీ పెరెడ్ గ్రౌండ్ కాదు.. వాక్ ఫాస్ట్ అని ప్రకాశ్ రాజ్ వాయిస్‌లో ఈ గ్లింప్స్ హైలెట్‌గా నడిచింది. ‘‘ సర్ ఐపీఎస్ ఆఫీసర్ సర్, అకాడమీ టాపర్ సర్’ అని ప్రకాశ్ రాజ్‌కు వేరే ఆఫీసర్ చెబితే.. ‘ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవ్.. ఓన్లీ నంబర్స్.. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి, డీటెయిల్స్ రాసి.. లెఫ్ట్, రైట్ సెంటర్ ఫొటోస్ తీయండి’ అని ప్రకాశ్ రాజ్ వాయిస్ అనగానే.. ‘వాడు వీడు ఏంటి సార్.. కాస్త గౌరవం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్’ అని మరో వాయిస్ బదులిస్తుంది. ‘వీడి గురించి విన్నాను. యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా.. బిహేవియర్‌లో తేడా ఉండదని. కండక్ట్ సర్టిఫికెట్ వల్ల ఒకసారి టర్మినేట్  అయ్యాడని. చూద్దాం.. ఈ ఖైదీ యూనిఫామ్‌లో ఎలా బిహేవ్ చేస్తాడో’ అని ప్రకాశ్ రాజ్ అనగానే.. ‘ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్.. ఇది రిమాండ్ పీరియడ్ కదా’ అని మరో ఆఫీసర్ వాయిస్ ప్రశ్నిచింది. ‘‘షట్ అప్! ఐ హేట్ సివిలియన్ కాస్ట్యూమ్స్ ఇన్ మై కాంపౌండ్. ఇట్ హాజ్ టు బీ ఐదర్ ఖాకీస్ ఆర్ ఖైదీస్. వీడి బట్టలు ఊడదీసి మెడికల్ టెస్ట్‌కు పంపించండి’ అని ప్రకాశ్ రాజ్ చెబుతుండటం చూస్తుంటే.. ప్రభాస్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

వన్ బ్యాడ్ హ్యాబిట్ (One Bad Habit)

‘మిస్టర్ సూపరిండెంట్.. నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ ప్రభాస్ వాయిస్‌ని ఈ గ్లింప్స్‌లో వినిపించారు. ఈ వీడియోలో సందీప్ రెడ్డి వంగా తనదైన ఇంటెన్స్, డార్క్ టోన్, వైలెంట్ ఎలిమెంట్స్‌ను స్పష్టంగా చూపించారు. ప్రభాస్‌ను ఒక మాస్, వైలెంట్ ఐపీఎస్ ఆఫీసర్‌గా చూపించే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది. ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణ ప్రభాస్ తన గురించి తాను చెప్పుకునే డైలాగ్. చిన్నప్పటి నుండి తనకు ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ ఉందని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పడం, ఆ ఒక్క డైలాగ్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ ఒక్క చెడ్డ అలవాటు ఏమిటనేది సస్పెన్స్‌గా ఉంచారు. మొత్తంగా అయితే ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ మాత్రమే కాదు.. మరో అద్భుతమైన సినిమా రాబోతుందనే ఫీల్‌ని ఇచ్చేసింది. టి-సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్‌కి చెందిన భద్రకాళి పిక్చర్స్ ‌కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతోంది. ప్రభాస్‌తో పాటు త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ వీడియో అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన, వైలెంట్ చిత్రంగా నిలవబోతోందనేది ఈ గ్లింప్స్ తెలియజేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..