Samantha: సైలెంట్‌గా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ మొదలు
Samantha Maa Inti Bangaram (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha: సైలెంట్‌గా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ మొదలు.. సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్!

Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించిన వార్తలతోనూ వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఈ దీపావళి వేడుకలను బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఈ రూమర్స్‌కు మరింత బలాన్నిచ్చింది. రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై ఆమె ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా, ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్న ఫోటోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు తనపై వస్తున్న వ్యక్తిగత వార్తలను పట్టించుకోకుండా, సమంత మాత్రం తన ప్రొఫెషనల్ కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించారు. చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) షూటింగ్‌ను సమంత సైలెంట్‌గా ప్రారంభించారు. ఎటువంటి హడావుడి, ఆర్భాటం లేకుండా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లడం ఆమె ప్రస్తుత పనితీరుకు అద్దం పడుతోంది.

Also Read- Upasana: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న ఉపాసన.. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్!

నందినీ రెడ్డి దర్శకత్వంలో..

‘ఓ బేబీ’, ‘జబర్దస్త్’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న నందినీ రెడ్డి (Nandini Reddy) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది, అదేమిటంటే.. ఇది సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. గతంలో ఈ బ్యానర్‌లో వచ్చిన శుభం అనే సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా సమంతకు ఇది రెండో సినిమా కానుంది. ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమా గురించి ఎక్కువ వివరాలు బయటకు రానప్పటికీ, సమంత గన్ పట్టుకుని ఉన్న యాక్షన్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఒకటి ఇప్పటికే విడుదలై అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

Also Read- The Girlfriend: నేషనల్ క్రష్ ‘ద గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా

ఈ పోస్టర్ చూస్తుంటే, ఇందులో యాక్షన్, డ్రామా పుష్కలంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను నందినీ రెడ్డి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను పక్కన పెట్టి, తన సొంత బ్యానర్‌లో, నందినీ రెడ్డి దర్శకత్వంలో, పూర్తిస్థాయి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సైలెంట్ ప్రాజెక్ట్ సమంత కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమంత గురించి వస్తున్న వార్తలు కాస్త ఆగాలంటే, ఆమె ఇలా షూటింగ్స్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడదే పని సమంత చేస్తోంది. మరి ఇకనైనా ఆమెపై రూమర్స్ ఆగుతాయేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!