Nayan Sarika (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sree Vishnu: దగ్గరలో ఏదైనా బార్ ఉందా?.. శ్రీ విష్ణు హీరోయిన్.. ఇలా అడిగేసిందేంటి?

Sree Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త హీరోయిన్ల హవా మొదలైన విషయం తెలిసిందే. అందులో ‘క’, ‘ఆయ్’ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు పొందిన నయన్ సారిక‌ (Nayan Sarika)కు వరస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే ఆమె ఐదారు సినిమాలలో హీరోయిన్లుగా చేస్తుంది. అందులో ఒకటి నిహారిక నిర్మించే రెండో సినిమా అయితే, ఇప్పుడు కొత్తగా మరో అవకాశం ఆమెను వరించింది. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరున్న శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా నటిస్తున్న సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయం మేకర్స్ స్వయంగా వెల్లడించారు. నయన్ సారిక పుట్టినరోజు (అక్టోబర్ 23)ను పురస్కరించుకుని, శ్రీవిష్ణు సినిమాలో నయన్ సారిక హీరోయిన్ అని మేకర్స్ ప్రకటస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.

Also Read- The Girlfriend: నేషనల్ క్రష్ ‘ద గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

బర్త్ డే స్పెషల్‌గా అనౌన్స్‌మెంట్

శ్రీ విష్ణు అనగానే టాలెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా అందరూ చెప్తారు. ఎందుకంటే, యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ.. ప్రతి సినిమాతో ప్రేక్షలకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటారు శ్రీ విష్ణు. అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు.. అందులో ఎంతో కొంత యూనిక్ కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా.. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో ఓ క్రేజీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. హేమ అండ్ షాలిని సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయన్ సారిక నటించనుందని తెలుపుతూ, ఆమెకు బర్త్ డే విషెస్ అందిస్తూ ఒక స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు.. ఈ ట్విస్ట్ ఏంటి?

దగ్గరలో ఏదైనా బార్ ఉందా?

ఈ వీడియో ఎంటర్‌టైనింగ్‌గా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. కారావాన్‌లో నయన్ సారిక రెడీ అవుతుండగా, ఆమె అసిస్టెంట్స్ వచ్చి.. బయట పెద్ద వార్ జరుగుతుంది మేడమ్.. మీరు బయటకు రావాలి అనగానే.. బయటికి వచ్చి చూస్తే.. ఆమె అభిమానులు అప్డేట్ కావాలని అడుగుతారు. అందులో ఇద్దరు అభిమానులు మీరంటే మాకు చాలా ఇష్టం.. మీ ‘ఆయ్’ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయా అని ఒకరంటే, మీ ‘క’ సినిమా చూసి ఫ్యాన్ అయ్యానని మరో అభిమాని అంటాడు. ఇప్పుడే హీరోతో సినిమా చేస్తున్నారని అడుగగా.. శ్రీ విష్ణుతో చేస్తున్నానని నయన్ సారిక చెప్పింది. అలాగే డైరెక్టర్, బ్యానర్ పేర్లు కూడా చెబుతుంది. ఆ వెంటనే ఫ్యాన్స్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అనగానే… ‘ఓరేయ్.. మీరు అడిగారని చెప్పాను. ఆ డిటైల్స్ ప్రొడక్షన్ కంపెనీ చెబుతుంది’ అని చెప్పినా వాళ్లు వినరు. ఇప్పుడేం చేద్దామని అసిస్టెంట్ అడగగానే.. దగ్గరలో ఏదైనా బార్ ఉందా? అని నయన్ అడుగుతుంది. ఇది ఈ వీడియోలోని మ్యాటర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగనుందని, ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని, తన సిగ్నేచర్ చార్మ్‌తో అలరిస్తారని మేకర్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!