Bigg Boss Telugu 9 (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు.. ఈ ట్విస్ట్ ఏంటి?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అదేంటి? హౌస్‌లోకి పోలీసులు రావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలే ఈ మధ్య బిగ్ బాస్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. ఆ ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఏమైనా హౌస్‌‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఈ షో‌ని ఆపేస్తున్నారని అనుకుంటున్నారేమో? అదేం లేదులే కానీ, పోలీసులు అయితే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించి 46వ రోజుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోని టీమ్ వదిలారు. ఈ ప్రోమోలో ఇద్దరు పోలీసులు హౌస్‌లోకి వచ్చినట్లుగా చూపించారు. ఆ పోలీసులు ఎవరో కాదు.. ఇంతకు ముందు సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా చేసిన అమర్ దీప్, అర్జున్ అంబటి. అవును.. వీరిద్దరూ గబ్బర్ సింగ్ అవతార్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, హౌస్‌లో జరిగిన దొంగతనాల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగా ఇది వీక్షకులు ఊహించని ట్విస్ట్ అనే అనుకోవాలి.

Also Read- The Raja Saab: బర్త్ డే స్పెషల్.. పాటన్నారు, కేవలం పోస్టర్ మాత్రమేనా!

జెండాలే మీ అజెండా..

46వ రోజుకు సంబంధించి విడుదలైన మొదటి ప్రోమోలో జెండాలే మీ అజెండా అనే టాస్క్‌ని బిగ్ బాస్ ఆడించినట్లుగా తెలుస్తుంది. వివిధ వేషధారణలో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోటకి పిలిచి, జెండాలే మీ అజెండా టాస్క్ గురించి బిగ్ బాస్ చెబుతున్నారు. ముందుగా బిగ్ బాస్ అని హౌస్‌మేట్స్ అన్న ప్రతిసారి ఇమ్మానుయేల్ ‘కొక్కొరొకో’ అని అరవాలని కండీషన్ పెట్టారు. ఇమ్ము అనేక విధాలుగా కోడి కూతతో ఎంటర్‌టైన్ చేశాడు. అనంతరం మడ్ గేమ్ మొదలైంది. ఈ టాస్క్‌లో ఒక బాక్స్ పెట్టి.. ఎన్ని జెండాలు సాధిస్తే.. అంతగా సక్సెస్ అయినట్లుగా బిగ్ బాస్ సూచించారు. దీని కోసం బురదలో తెగ కొట్టేసుకున్నారు. ఇమ్ము ఎంతగా ట్రై చేసినా, పవన్ మాత్రం జెండాలు స్వీకరిస్తూనే ఉన్నాడు. ఫైనల్ విన్నర్ ఎవరనేది బిగ్ బాస్ ఈ ప్రోమోల చూపించలేదు కానీ, ఈ మడ్ టాస్క్ మాత్రం వీక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మరి జంట్స్ మాత్రమేనా? లేదంటే లేడీస్ కూడా ఈ గేమ్‌లో పాల్గొంటారా? అనేది షో చూస్తే కానీ తెలియదు.

Also Read- Tollywood dominance: ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుందా.. మన దర్శకులకు ఆ సత్తా ఉందా..

పోలీస్ ఎంట్రీ..

రెండో ప్రోమో విషయానికి వస్తే.. అమర్ దీప్ (Amar Deep), అర్జున్ (Arjun Ambati) పోలీస్ గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చి, కంటెస్టెంట్స్‌తో పరిచయం చేసుకున్నారు. గ్యాంగ్ స్టర్స్ పాత్రలో ఉన్న సంజన, మాధురిలను పట్టుకోవడానికి వచ్చినట్లుగా వారు చెప్పారు. అయితే ఈ గ్యాప్‌లో వారు హౌస్‌లో జరిగిన దొంగతనాల గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు. ఈ సెర్చింగ్ వారు కనుగొన్న ఐటమ్స్ చూసి షాకయ్యారు. కిచెన్‌లో ఉండాల్సిన సామాగ్రి అంతా బెడ్ రూమ్‌లోనే ఉందేంటి? అని అమర్ దీప్ ఆశ్చర్యపోతూ ఒక్కోటి బయటకు తీస్తున్నారు. ఎగ్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్.. ఇలా చాలానే వారికి దొరికాయ్. వాటిలో కొన్ని అమర్ దీప్ నొక్కేస్తున్నాడు కూడా. మరి వారికి సంజన, మాధురి దొరికారా? దొరికితే వాళ్లని ఏం చేశారు? వీరిద్దరూ హౌస్‌లో ఎంత సేపు ఉన్నారు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!