mass-jatara( IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: ‘మాస్ జాతర’ స్టోరీ ఏంటో చెప్పేసిన నిర్మాత నాగవంశీ.. మాస్‌కి జాతరేనా..

Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ సినిమా గురించి ఏమైనా చెప్పాల్సి వచ్చినపుడు సినిమా లైన్ ఏంటో చెప్పేశారు. ఇంటర్వెల్ కు ఇరవైనిమాషాలు ముందు నుంచీ సెకండాప్ మొదలైన 15 నిమిషాల తర్వాత ఒక పాట వస్తది ఆ పాట తర్వాత నుంచి లాస్ట్ వరకూ దాదాపు గంటా ఇరవై నిమిషాలు థియేటర్ మొత్తం ఊగిపోతుంది. అంతే కాకుండా ప్రీ క్లైమాక్స్ ఇరగదీస్తాయి. చివరిలో రాజేంద్ర ప్రసాద్ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇలా సినిమా మొత్తం మాస్ ప్యాక్ తో నిండి ఉంటుంది. ఈ సారి చెబుతున్నా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అంటూ సినిమాలో జరిగే ట్వస్ట్ ల గురించి చెప్పుకొచ్చారు. దీంతో స్టోరీ మొత్తం ఇక్కడే రివీల్ అయిపోయిందంటూ రవి తేజ ప్యాన్స్ నిర్మాతపై మండి పడుతున్నారు.

Read also-Highest paid heroes: టాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోలు వీళ్లే..

‘మాస్ జాతర’ కథ ఒక లోకల్ జాతర (ఉత్సవం) చుట్టూ తిరుగుతుంది. రవి తేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిగా నటిస్తూ, రౌడీ గ్యాంగులు, అవినీతికర రాజకీయవేత్తలతో పోరాడుతాడు. ఈ జాతర సందర్భంగా జరిగే ప్రమాదాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, హాస్య ఎలిమెంట్స్ మిక్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రూపొందించబడింది. డైరెక్టర్ భాను భోగవరాపు తొలి చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. “ఇది రవి తేజ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా రూపొందించిన మాస్ ఫెస్ట్” అని టీమ్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం మొదట మే 9, 2025కి ప్లాన్ చేసినా, ఇతర కారణాల వల్ల ఆగస్ట్ 27కి మార్చారు. తర్వాత నిర్మాత ‘వార్ 2’ విఫలం కారణంగా మళ్లీ అక్టోబర్ 31కి జరిగింది.

Read also-Magadheera cameo viral: రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో కామియో రోల్ చేసిన రాజమౌళి ఫేవరెట్.. ఎవరంటే?

రవి తేజ హీరోగా, ధమాకాలో తర్వాత శ్రీలీల హీరోయిన్‌గా ఈ జోడీ మళ్లీ కనిపిస్తోంది. శ్రీలీల పాత్ర గురించి టీజర్‌లో ఆకట్టుకున్న గ్లింప్స్ కనిపించాయి. నితీష్ నిర్మల్ స్నేహితుడిగా, రితు పీ సూద్ తల్లిగా, కృష్ణ కుమార్ మామగా, రాజేంద్ర ప్రసాద్ మొదలైనవారు కీలక పాత్రల్లో ఉన్నారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో విధు అయ్యన్నా సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది