Adluri Laxman Kumar ( image credit: swetcha reporter)
తెలంగాణ

Adluri Laxman Kumar: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం: మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్

Adluri Laxman Kumar: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, సీఎం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిపాలనకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman Kumar)​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులుగా నియమితులైన అభ్యర్థులకు తెలంగాణ సెక్రటేరియట్ లోని ఎస్సీ డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక వేలాది మంది కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారదన్నారు.

Also  Read: Adluri Laxman Kumar: గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్‌లు పెంచేందుకు ప్రభుత్వం సిద్దం

ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడు  

ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని ,తదనుగుణంగా అధికారులు పనిచేయాలని గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ కోసం క్రమశిక్షణతో పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసాల తో శ్రమిస్తే ఉద్యోగులయ్యారని గుర్తు చేశారు.అందుకే పేరెంట్స్ ను బాగా చూసుకోవాలన్నారు. ఇక హాస్టల్ విద్యార్థులకు మంచి చదువుని ఇచ్చి మంచి భవిష్యత్తును ఇవ్వాలని మంత్రి కోరారు.

హాస్టల్ విద్యార్థులకు 40 శాతం చార్జీలు 

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవ తో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బిఏఎస్) పథకానికి సంబంధించిన 25 శాతం నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇప్పించారని అభినందించారు. హాస్టల్ విద్యార్థులకు 40 శాతం చార్జీలను 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని, సహకరించిన మల్లు భట్టి విక్రమార్కకు, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Adluri Laxman Kumar: మైనార్టీ ఉద్యోగుల జీతాల్లో టెక్నికల్ ఎర్రర్.. త్వరలో జీఓ జారీ!

Just In

01

Kunamneni Sambasiva Rao: మోదీ పాలనలో దేశ పరిస్థితి తిరోగమనం: ఎమ్మెల్యే కూనంనేని

Disability Empowerment: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..!

Telangana Tourism: టూరిజం అభివృద్దికి సహకరించరా!.. మంత్రుల భేటీలోనూ కొలిక్కిరాని సమస్య

Uttam Kumar Reddy: తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్దరణకు ప్రభుత్వం కసరత్తు

Indiramma Housing Scheme: గ్రేటర్‌లో ఏడాదిగా ఇందిరమ్మ ఇండ్ల పథకం పెండింగ్.. కారణం అదేనా..?