Naga Vamsi: ప్రీరిలీజ్ ఈవెంట్ లలో వైరల్ కామెంట్లు చేసి పాపులర్ అయ్యరు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ. తాజాగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ‘వార్ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరించారు. ‘వార్ 2’ సమయంలో సినిమాకు రాకపోతే ఊరుకోను అంటూ చెప్పారు. కానీ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆయనపై ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఈ సినిమా నిర్మాతలు నమ్మించి ముంచేశారని అన్నారు. అయితే వార్ 2 సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆ సమయంలో అన్న మాటలను సమర్థించారు. అందరూ తప్పులు చేస్తారు ఇదీ అలాంటిదే అని చెప్పుకొచ్చారు.
Read also-K Ramp collections: మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన కిరణ్ అబ్బవరం ’కే ర్యాంప్’.. ఎంతంటే?
రవి తేజ హీరోగా ‘మాస్ జాతర’ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతుంది. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర్ నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. రవితేజ 75వ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం విశేషం.స్టోరీలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఒక ప్రాంతంలో ప్రజలను పీడిస్తూ ఉండే దుర్మార్గుడిని ఎదుర్కొనే కథ. ఆ ప్రాంతానికి రవితేజకు ఏ సంబంధం? ప్రజలకు విముక్తి ఎలా కలుగుతుంది? అనే కోణంలో సినిమా ముందుకు సాగుతుంది. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, కామెడీ టైమింగ్, రొమాన్స్ – అన్నీ బ్యాలెన్స్‌గా ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా ఫ్రెష్ ఎంట్రీ ఇచ్చి, డ్యాన్స్, ఎమోషన్స్‌లో మెరిసింది. ఇద్దరూ ‘ధమాకా’లో సక్సెస్ ట్యాగ్ తెచ్చుకున్న జోడి, ఇక్కడ కూడా మ్యాజిక్ ఎలా ఉండబోతుందో ఈ 31 చూడబోతున్నారు అని నిర్మాతలు ఉన్నారు.
Read also-Magadheera cameo viral: రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో కామియో రోల్ చేసిన రాజమౌళి ఫేవరెట్.. ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ ఎంటర్‌టైనర్‌గా పేరుగాంచిన రవితేజ, తన యాక్షన్-కామెడీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల మనసులు ఆకర్షిస్తున్నాడు. 2024లో వచ్చిన అతని రెండు సినిమాలు మిక్స్డ్ రెస్పాన్స్ పొందినప్పటికీ, 2025-2026లో లైనప్‌లో ఉన్న ప్రాజెక్టులు ఫ్యాన్స్‌ను ఉత్కంఠలో ముంచేస్తున్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 21, 2025 నాటికి, రవితేజ తాజా రిలీజ్‌లు 2024కి పరిమితమైనప్పటికీ, రానున్న ‘మాస్ జాతర’తో మరో మాస్ ఫెస్ట్ ఆశిస్తున్నారు.
