Vishal directorial debut: హీరోగా మొదలైన సినిమాకు దర్శకుడిగా..
k ramp (image x)
ఎంటర్‌టైన్‌మెంట్

Vishal directorial debut: హీరోగా మొదలై సినిమాకు దర్శకుడిగా మారిన విశాల్ .. అప్డేట్ ఏంటంటే?

Vishal directorial debut: విశాల్ తెలుగు తమిళ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరో. ఆయనకు దర్శకత్వ శాఖలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే దర్శకుడిగా ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. అయితే ‘మకుటం’ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. అయితే దర్శకుడిగా రవి అరసు ఆధ్వర్యంలో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. విశాల్ ప్రస్తుతం ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ న్యూస్‌ను ప్రకటించారు. ఈ మేరకు విశాల్ స్పందిస్తూ..

Read also-K Ramp collections: మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన కిరణ్ అబ్బవరం ’కే ర్యాంప్’.. ఎంతంటే?

‘దీపావళి ప్రత్యేక సందర్భంగా నా ప్రస్తుత చిత్రం మగుదం/మకుటం నుంచి సెకండ్ లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ ప్రారంభ దశలోనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.. కానీ ఇది ఇంత వరకు పెండింగ్‌లోనే పెట్టాను. ఈ పండుగ సందర్భంగా ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నాం. ఈ మూవీతో నేను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని ప్రకటించేందుకు సమయం ఆసన్నమైంది. అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ పరిస్థితులు నన్ను ఈ విధంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలనే కీలకమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయం బలవంతం వల్ల కాదు బాధ్యత వల్ల తీసుకోవడం జరిగింది. ఒక నటుడిగా.. సినిమా అనేది మనల్ని నమ్మే ప్రేక్షకులకు, ప్రతి ప్రాజెక్ట్‌లో తమ విశ్వాసాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే నిర్మాతలకు ఒక నిబద్ధత అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. ఇప్పుడు మగుదం/మకుటం కోసం దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం మాత్రమే ఈ సినిమాను ఉన్నతంగా నిలబెట్టడానికి, నిర్మాత ప్రయత్నాలు రక్షించబడటానికి, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి ఏకైక మార్గం.

Read also-songs importance: తెలుగు సినిమాల్లో పాటలకు చోటు తగ్గుతుందా.. దీనికి కారణమేంటి..

కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడం, విషయాలను చక్కదిద్దడం, తద్వారా భవిష్యత్తులోని పెద్ద చిత్రాన్ని అత్యంత ప్రభావవంతంగా, విజయవంతంగా చూడటానికి వీలుగా ఉంటుంది. ఈ దీపావళి నాకు సరిగ్గా అదే సూచిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని బహిర్గతం చేశాం. ఇకపై ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. మేం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాం. ఇది మాకు కొత్త ఆరంభం.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..