K Ramp collections: కిరణ్ అబ్బవరం నటించిన “కె ర్యాంప్” మూవీ హౌస్ ఫుల్ షోస్ తో, పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోందీ మూవీ. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని ‘కె-ర్యాంప్” చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు.
Read als0-Lady-Oriented Movies: టాలీవుడ్‌లో పెరుగుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. అందుకేనా?
ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సిటీస్ తో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు “K-ర్యాంప్” సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.
Read also-songs importance: తెలుగు సినిమాల్లో పాటలకు చోటు తగ్గుతుందా.. దీనికి కారణమేంటి..
Prekshaka Devullaki 🙏❤️#KRamp #DiwaliKAblockbuster pic.twitter.com/9b5Ednjm4J
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 21, 2025
