Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్, తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా ఎదిగి, తెలుగు ప్రేక్షకుల్లో కూడా గట్టి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు వరుస విజయాలతో నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘డ్యూడ్ సీఎం’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌తో ఆయన రెమ్యూనరేషన్ ఆకాశాన్ని అంటుతోంది. ‘డ్రాగన్’ సినిమాకు రూ. 2 కోట్లు తీసుకున్న ఆయన, ‘డ్యూడ్’ కోసం రూ. 12 కోట్లు చార్జ్ చేశాడు.
ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం రూ. 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో, ఆయన అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వారు వెనుకాడటం లేదు. దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా మారి, ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకెళ్తున్న ప్రదీప్ జర్నీ నిజంగా అందరికీ ఆదర్శం అనే చెప్పుకోవాలి. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్కిల్స్ ఆయనకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. గతంలో కొందరు ఆయనను హీరో మెటీరియల్ కాదని ఎగతాళి చేసినా, తన నటనతో విమర్శకుల నోరు మూయించి, ఈ రేంజ్‌కు ఎదిగాడు.
తెలుగులో యూత్‌ఫుల్ కథలతో ఆకట్టుకునే హీరోలు అరుదుగా కనిపిస్తుండటంతో, ప్రదీప్ లాంటి నటుడు ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడం ఆసక్తికరం. తెలుగు దర్శక, నిర్మాతలు కూడా ప్రదీప్‌తో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొందరు నిర్మాతలు ఆయనకు బ్లాంక్ చెక్ ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం ఆయన రెండు పెద్ద బ్యానర్‌లతో సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా హిట్ అయితే, ప్రదీప్ రంగనాథన్ స్టార్‌డమ్ ఆగడం ఎవరి వల్లా సాధ్యం కాదు.
