kiran-abbavaram( image :X)
ఎంటర్‌టైన్మెంట్

K Ramp collection: ‘కె ర్యాంప్’ ఫస్ట్ డే అధికారిక లెక్కలు వచ్చేశాయ్.. ఎంతంటే?

K Ramp collection: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె ర్యాంప్’ సినిమా థయేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక కలెక్షన్స్ వచ్చేశాయి. మొదటి రోజు ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాతలు. అందులో మొదటి రోజు కలెక్షన్స్ రూ. 4.5 కోట్లు గా ఉంది. అయితే దీపావళికి విడుదల చేసిన సినిమాల్లో ఇదే మంచి కలెక్షన్లు సాధించిన సినిమాగా ఉంది. ఇప్పిటికే సినిమాపై మిక్సుడ్ టాక్ వచ్చినా రాను రాను పుంజుకుంటుందని హీరో చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అందులో ఇంతకు ముందు ఎస్ ఆర్ కళ్యాణ మండపం కూడా ఇలాంటి టాక్ తోనే మంచి హిట్ సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుంది అని అన్నారు. డే ఒన్ మంచి వసూళ్లు సాధించడంతో ఈ సినిమా హిట్ గానే పరిగణిస్తున్నారు నిర్మాతలు. అయితే రాను రాను ఎలా సాగుతుందో చూడాలి.

Read also-Travis Scott: అందుకు అమెరికన్ ర్యాపర్‌పై రగిలిపోతున్న ఇండియన్స్.. ఎందుకంటే?

ఇక కథ విషయానికొస్తే.. ఒక సంపన్న కుటుండంలో ఉన్న సాయికుమార్ కు కొడుకుగా పుడతాడు కిరణ్ అబ్బవరం. అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు, బాధ్యదలకు దూరంగా ఉంటాడు. ఇదంతా చూస్తున్న కిరణ్ తండ్రి కుర్రాడిని సెట్ చేయాలని కేరళలోని ఒక కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడ (కిరణ్ అబ్బవరం) కుమార్‌కు మెర్సీ (యుక్తి తరేజా) పరిచయమవుతుంది. హరోయిన్ ఒక అందమైన అమ్మాయ. కానీ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. ఆమెతో ప్రేమలో పడిన కుమార్, ఆమె సమస్యలు (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ – PTSD) తెలుసుకుని ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు? తన చిల్లర లైఫ్ నుంచి బాధ్యతల వైపు మళ్లి, తండ్రి-కొడుకు బంధాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? ఇది మెయిన్ ట్రాక్. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ మిక్స్ అయి సాగుతుంది. ఇంటర్వల్ లో ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఎక్కువగా ఫన్, ఎమోషన్ మీదకు ఫోకస్ అవుతుంది.

Read also-Chiranjeevi: బండ్ల గణేష్ పార్టీలో బాస్ రాయల్టీ చూశారా.. కల్ట్ ఫ్యాన్ ఖుషీ..

సినిమాటోగ్రఫీ పరంగా సతీష్ రెడ్డి కేరళ బ్యాక్‌డ్రాప్ బాగా చూపించారు. “సతీష్ రెడ్డి మసం కెమెరా వర్క్ నీట్, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్ ఫెస్టివ్ వైబ్ తెచ్చాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతానికి మిశ్రమ స్పందన వచ్చింది. “కలలే కలలే” సాంగ్ స్టాండౌట్, రొమాన్స్ ట్రాక్‌కు పర్ఫెక్ట్. మొత్తంగా సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో చోటా కె. ప్రసాద్ తేలిపోయారు. ఈ సినిమాలో ఇక్కడే మెయిన్ వీక్‌నెస్ తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో స్లో పేసింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఎడిటింగ్ ఇంకాస్త మెరుగు పడాలి. హస్యా మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్ “గుడ్” అని చెప్పాలి. ఈ సినిమాను మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలంటే టెక్నికల్స్ మరింత షార్ప్‌గా ఉండాలి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!