Telangana Tourism (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Tourism: తెలంగాణ పర్యాటక రంగం కొత్త వ్యూహం.. బుద్ధవనానికి ఇంటర్నేషనల్ లుక్

Telangana Tourism: రాష్ట్ర పర్యాటకశాఖ బుద్ధవానికి ప్రతివారంలో ఒక రోజు టూర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నల్లగొండ(Nalgonda) జిల్లా నాగార్జునసాగర్(Nagarjunasagar) సమీపంలోని నందికొండ హిల్స్ కాలనీలో ఉన్న అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనంకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు, అలాగే రాష్ట్ర పర్యాటక శాఖకు ఆదాయం సమకూర్చేందుకు అధికారులు కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. బౌద్దులు ఎక్కువగా శ్రీలంక(Srilanka), మయన్మార్(Mayanmar), బంగ్లాదేశ్(Bangladesh), థాయిలాండ్(Thailand), కాంబోడియా(Kambodia), వియత్నం, ఇండోనేషియా, మలేషియా, చైనా, తైవాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, నేపాల్‌లో ఉన్నారు. ఈ దేశాల నుంచి వచ్చే బౌద్ధులను లక్ష్యంగా చేసుకొని, వారంలో ఒకరోజు ‘వన్డే టూర్’ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బౌద్ధులను హైదరాబాద్ నుంచి బుద్ధవనం వరకు తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.

ప్రాజెక్టు వివరాలు ఇలా..

బుద్ధవనంకు చెందిన 274 ఎకరాలలో, ప్రస్తుతం 90 ఎకరాల్లో అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ, పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, హాస్పిటాలిటీ, వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు సంబంధించిన 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలు, భారతదేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించారు. ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్దక్షేత్రం. 2వేల ఏళ్ల క్రితం ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశంగా, ఆయన స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, బౌద్ధమత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతం గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల అని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: Pankaj Dheer: ఆ సమయంలో సర్వస్వం కోల్పోయిన పంకజ్ ధీర్ కుటుంబం.. ఎందుకంటే?

జననం నుంచి..

స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు శిల్పాలు ఏర్పాటు చేశారు. బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులుగా ఏర్పాటుచేశారు. అదే విధంగా బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉండడంతో ఇక్కడ 22 రకాల చెట్లను పెంచుతున్నారు. సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజులపాటు కఠోర తపస్సు చేసి, హృదేలా గ్రామంలో సుజాతాదేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ ఇతివృత్తాంతాన్ని ప్రతిబింబిచేలా మహాస్తూపం కిందిభాగంలో మోకాళ్ళ మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు. 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో మహాస్తూపాన్ని నిర్మించారు. విశాలమైన ధ్యాన మందిరం, లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం కూడా ఉన్నాయి. ఇవి బౌద్దులను ఆకట్టుకుంటున్నాయి. దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు టూరిజంశాఖ ప్రణాళికలు రూపకల్పన చేసింది.

ప్రైవేట్ భాగస్వామ్యంతో..

ప్రభుత్వ ఆదేశాల మేరకు, టూరిజం శాఖ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. మహాబోధి సొసైటీకి 10 ఎకరాలు, తైవాన్‌కు చెందిన పోగ్వాంగ్ శాంగ్ సంస్థకు 5 ఎకరాలను కేటాయించారు. ఈ సంస్థలు వెల్ సెంటర్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. మరో 14 ఎకరాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రదేశంలో వెడ్డింగ్ డెస్టినేషన్, కన్వెన్షన్ సెంటర్, వెల్నెస్ సెంటర్లతో పాటు పర్యాటకులకు బస చేసేందుకు వీలుగా స్టార్ హోటళ్లను నిర్మించనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా ప్రతినెలా ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నారు.

తెలంగాణ అంటేనే..

‘సాగర్‌లోని బుద్ధవానికి వారంలో ఒక రోజూ బౌద్దుల కోసం టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే బౌద్దులు ఎక్కువగా ఉన్న దేశాల్లో బౌద్ధక్షేత్రం ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. పది దేశాలకు చెందినవారు వస్తుండటంతో ఇంకా ఎక్కువ టూరిస్టులు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బుద్దవనంపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. అందులో భాగంగానే కేంద్రం నిధులతో, మరోవైపు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో, స్వచ్ఛసంస్థలు ముందుకు వస్తే వారి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. తెలంగాణ అంటేనే టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం’ అని పర్యాటక శాఖ ఎండీ వల్లూరి క్రాంతి తెలిపారు.

Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!