Mega Heroes Films (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Mega Heroes: ఒకే వేదికపై రెండు సినిమాల అప్డేట్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Mega Heroes: మెగా అభిమానులను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేనీ ఖుషి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మాత నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలై మిశ్రమ స్పందనను రాబట్టుకుని, థియేటర్లలో రన్ అవుతోంది. దీవాళి స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ రాబడుతుందని, ప్రేక్షకులు పెద్ద విజయం అందించారని చెప్పేందుకు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘డ్యూడ్’ సినిమా సక్సెస్‌కు సంబంధించిన విశేషాలే కాకుండా.. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించే కాకుండా, త్వరలో చరణ్-సుక్కు కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా వివరాలను కూడా నిర్మాత నవీన్ యెర్నేనీ తెలియజేశారు.

Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ దీవాళి పార్టీ.. టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లోనే.. ఏదో ప్లాన్ చేశాడయ్యో!

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ అప్డేట్

ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా గురించి తెలుపుతూ.. ఈ దీపావళికి ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రావడం లేదని తెలిపారు. దీపావళికి రాకపోయినా, ఆ వెంటనే వరసగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ అప్డేట్స్ ఉంటాయని, పాటలు, టీజర్, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో హరీష్ శంకర్ చాలా ప్లాన్డ్‌గా ఉన్నారని తెలిపారు. అంతేకాదు, ప్రస్తుతం ఫ్లాప్స్‌లో ఉన్న హరీష్ శంకర్ దాదాపు 12 ఏళ్ల కసి ఈ సినిమా రూపంలో కనిపిస్తుందని, ఫ్యాన్స్‌ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read- Rashmika Mandanna: విజయ్‌తో ఎంగేజ్‌మెంట్‌పై నేషనల్ క్రష్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఓపెనింగ్ ఎప్పుడంటే..

సుకుమార్ తదుపరి సినిమా ఏ హీరోతో అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పుష్ప 3’ సినిమా ఇప్పుడప్పుడే ఉండదు. ముందుగా రామ్ చరణ్‌తో సినిమా ఉంటుంది. ప్రస్తుతం బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా పూర్తవ్వగానే సుకుమార్ – రామ్ చరణ్ సినిమాను ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే‌లో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులపై సుకుమార్ బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ రెండు వార్తలు కూడా మెగా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించేవే. ఎందుకంటే, రెండు సినిమాలపై బీభత్సమైన హైప్ ఉంది. మధ్యమధ్యలో ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ హైప్ డబుల్ అవుతుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అందులోనూ ‘రంగస్థలం’ తర్వాత సుక్కుతో ఈసారి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు చరణ్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ సినిమాకు సీక్వెల్‌గా వీరి కాంబో ఫిల్మ్ ఉండబోతుందని తెలుస్తుంది. అదే నిజమైతే మాత్రం.. ఆ సినిమాకు మిస్సయిన నేషనల్ అవార్డ్.. ఈసారి పక్కా అనేలా ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!