Rashmika Mandanna: ఎప్పుడూ నవ్వుతూ కనిపించి దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ (National Crush) బిరుదును సొంతం చేసుకున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఈ మధ్య ఎక్కువగా వార్తలలో హైలెట్ అవుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతూ.. అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రష్మిక, ప్రస్తుతం సినిమా వార్తలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa2: The Rule), ‘యానిమల్’, ‘ఛావా’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తనను తాను బాక్సాఫీస్ స్టార్‌గా నిరూపించుకున్న రష్మిక.. సౌత్ ఇండియన్ సినిమా నుంచి బాలీవుడ్ వరకు చేసిన ప్రయాణంతో ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే..
Also Read- Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
అధికారికంగా ప్రకటించలేదు కానీ,
రష్మిక మందన్నా ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ జంట త్వరలోనే అధికారికంగా ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే పెళ్లి కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఉండవచ్చని అనుకుంటున్నారు. కానీ, ఎంగేజ్‌మెంట్ విషయాన్ని వీరిద్దరూ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కాకపోతే, ఈ వార్తలకు బలం చేకూర్చేలా, రష్మిక ధరించిన డైమండ్ రింగ్, విజయ్ చేతికి ఉన్న సాధారణ బ్యాండ్‌తో ఉన్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండటంతో, వీటిని చూసిన వారంతా.. ఇద్దరూ ఒకే రకమైన ఉంగరాలను ధరించారనేలా డిస్కషన్స్ చేస్తూ.. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా ధృవీకరిస్తున్నారు.
Also Read- Bigg Boss Telugu 9: రమ్య.. నువ్వు రాణివి కావు – ఇమ్మూ.. నీకు పగిలిపోద్ది.. నాగ్ నోట అలాంటి మాట!
ఎంగేజ్‌మెంట్ వార్తలపై రష్మిక రియాక్షన్
తాజాగా రష్మిక తన కొత్త సినిమా ‘థామా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలపై స్పందించింది. డైరెక్ట్‌గా అయితే చెప్పలేదు కానీ, దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లుగానే భావించవచ్చు. ఇంటర్వ్యూయర్ ఆమెకు అభినందనలు చెప్పగా, రష్మిక కాస్త గందరగోళానికి లోనైనట్లు కనిపించింది. ఆ తరువాత, ‘మరేదైనా ఉందా?’ అని ప్రశ్నించగా, ఆమె చిరునవ్వుతో, సిగ్గుపడుతూ.. ‘‘నిజానికి, చాలా జరుగుతున్నాయి. కానీ వాటన్నింటికీ మీ అభినందనలు తీసుకుంటాను’’ అని సమాధానమిచ్చారు. రష్మిక యొక్క ఈ స్వీట్, సిగ్గుపడే రియాక్షన్ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించే అని అంతా ఫిక్సవుతున్నారు. ఇదే ఆమె ఫస్ట్ రియాక్షన్‌గా తీసుకుంటున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాలలో నటించారు. తెరపై వారి కెమిస్ట్రీ చూసి అభిమానులు ముగ్ధులయ్యారు. ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించనప్పటికీ, వారిద్దరి మధ్య లోతైన బంధం ఉందని విషయం వారి ప్రతి మూమెంట్‌లోనూ తెలుస్తూనే ఉంది. ఇప్పుడు, ఎంగేజ్‌మెంట్ వార్తలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నందున, ఈ ప్రేమ జంట ఎప్పుడు ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
